చంద్రబాబులో వణుకు మొదలైంది.. సుబ్రహ్మణ్యస్వామి

By telugu news teamFirst Published Sep 22, 2020, 1:57 PM IST
Highlights

తిరుమల శ్రీవారి దర్శనాల్లో డిక్లరేషన్ అంశంపై చంద్రబాబు అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

తిరుమలకు భక్తులు దాతల నుంచి విరాళలు కానుకల రూపంలో అందే నిధులు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. టీటీడీ నిధులు దుర్వినియోగమౌతున్నాయని పక్కదారి పడుతున్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏటా వందల కోట్ల రూపాయల మేర ఆదాయం అందుతుంటుంది. భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలు హుండీ ఆదాయం టికెట్లు ప్రసాదాలను విక్రయించడం ద్వారా వచ్చే రాబడి కోట్ల రూపాయల మేర ఉంటుంది. కాగా.. ఈ నిధులన్నీ దారితప్పుతున్నాయంటూ వార్తలు వస్తున్న క్రమంలో... దీనిపై కాగ్ తో దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. కాగా.. ఈ అంశంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు.

టీటీడీ నిధుల వినియోగంపై కాగ్ దర్యాప్తుకు అనుకూలంగా పాలకమండలి తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబులో వణుకు మొదలైందని బీజేపీ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనాల్లో డిక్లరేషన్ అంశంపై చంద్రబాబు అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

అందులో భాగంగానే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడూ ఏ మతస్తుడు అన్న విషయం గుర్తించడం కష్టమని.. భక్తుడు తనకు తాను చెబితేగానీ తెలియదని టీటీడీ ఛైర్మన్ మాట్లాడరని.. సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. 

click me!