సుబ్రహ్మణ్య స్వామితో రమణ దీక్షితులు భేటీ

First Published May 23, 2018, 4:01 PM IST
Highlights

సుబ్రహ్మణ్య స్వామితో రమణ దీక్షితులు భేటీ

తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రభుత్వ నియంత్రణ ఉండరాదని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతో
ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ వివాదంపై స్పందించారు.

రమణ దీక్షితులను విధుల నుంచి తొలగించిన విషయం, ఆయన చేస్తున్న ఆరోపణలపై సుప్రీం కోర్టుకు వెళతానని చెప్పారు. ఈ విషయంపైనే రమణ దీక్షితులతో చర్చించినట్లు తెలిపారు.బిజెపికి ఈకేసుతో సంబందం లేదని, తాను హిందూ విరాట్ సంస్థ తరపున కేసు వేయాలని భావిస్తున్నానని అన్నారు.

రమణ దీక్షితులను రిటైర్ చేసే అదికారం టిటిడికి లేదని అన్నారు. అసలు టిటిడి పై సమీక్ష చేసే అదికారం కూడా ముఖ్యమంత్రికి లేదని అన్నారు.గతంలో దేవాలయ బంగారుపూత కేసులో విజయం సాదించామని ఆయన చెప్పారు. టిటిడిలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ కోరతామని కూడా ఆయన అన్నారు

click me!