నేను ఎంపీగా ఉండగానే విశాఖకు రైల్వేజోన్‌: హరిబాబు

First Published Jul 21, 2018, 2:50 PM IST
Highlights

తాను ఎంపీగా ఉండగానే ఏపీకి రైల్వేజోన్ వస్దోందని విశాఖ ఎంపీ హరిబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏపీకి ఇచ్చిన హమీల కంటే ఎక్కువే   నిధులను కేంద్రం ఇచ్చిందని  ఆయన చెప్పారు. 
 


అమరావతి: తాను ఎంపీగా ఉండగానే ఏపీకి రైల్వేజోన్ వస్దోందని విశాఖ ఎంపీ హరిబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏపీకి ఇచ్చిన హమీల కంటే ఎక్కువే   నిధులను కేంద్రం ఇచ్చిందని  ఆయన చెప్పారు. 

శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  ఏపీని ఆదుకొనేందుకు  చట్టంలో లేని వాటికి కూడ కేంద్రం ఉదారంగా నిధులు ఇస్తోందన్నారు.  పెట్రోలియం వర్శిటీకి ఏపీ ప్రభుత్వం ఇంతవరకు కూడ స్థలాన్ని కేటాయించలేదని హరిబాబు చెప్పారు.

రాష్ట్రం చేయాల్సిన పనులు చేయకుండా  కేంద్రం సహకరించడం లేదని  చెప్పడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విభజన హమీ చట్టంలో ప్రకటించినట్టుగా  11 సంస్థల్లో పది సంస్థలను మంజూరు చేసినట్టు ఆయన గుర్తు చేశారు.

ఇంకా పదేళ్ల సమయంలో ఏపీ రాష్ట్రాన్ని వాగ్ధానాలను అమలు చేసే అవకాశం ఉందని హరిబాబు చెప్పారు.  అయితే పదేళ్ల కంటే ముందుగానే  విభజన చట్టంలోని హమీలను అమలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 

ఏపీకి కేంద్రం ఏం చేయలేదని చేసే విమర్శల్లో వాస్తవం లేదన్నారు. దుగ్గరాజుపట్నం కోసం మరో స్థలాన్ని సూచించాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
 

click me!