యూటర్న్ నాది కాదు, మీదే: మోడీకి బాబు రిప్లై

First Published Jul 21, 2018, 1:47 PM IST
Highlights

మెజార్టీకి, నైతికతకు మధ్య పోరాటం సాగుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. తాము ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతిచ్చిన పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
 

న్యూఢిల్లీ: మెజార్టీకి, నైతికతకు మధ్య పోరాటం సాగుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. తాము ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతిచ్చిన పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

శనివారం నాడు న్యూఢిల్లీలో చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో  అధికారంలోకి వచ్చినట్టుగా మోడీ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాన్ని ఆయన ప్రస్తావించారు. తాము కూడ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పారు. ప్రజల అవసరాల కోసం 15 ఏళ్ల తర్వాత తాము అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.

ఏపీ అభివృద్ధి కోసమే ఆనాడు బీజేపీలో చేరినట్టు ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో  తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని  మోడీ చేసిన ప్రసంగాన్ని ఆయన మీడియా సాక్షిగా గుర్తు చేశారు. అమరావతిలో  రాజధాని శంకుస్థాపన సమయంలో కూడ ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని మోడీ వాగ్ధానం చేశారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో  తాము కూడ కష్టపడుతున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. 29 సార్లు ఢిల్లీకి వచ్చి ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరినట్టు చెప్పారు. కానీ, ఇంతవరకు ఏపీ సమస్యలను పరిష్కరించలేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరీకీ ప్రత్యేక హోదా లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామని చెప్పిన విషయాన్ని బాబు ప్రస్తావించారు.  ఎవరికీ  పన్ను రాయితీలు  లేవన్నారు. కానీ, 11 రాష్ట్రాలకు  పన్ను రాయితీలు ఇస్తున్నారని ఆయన చెప్పారు.  కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న మీరు... అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నదేమిటని బీజేపీ నేతలను బాబు ప్రశ్నించారు.


 ఇదేనా రాష్ట్రాలతో కేంద్రం వ్యవహరించిన తీరు అంటూ బాబు ప్రశ్నించారు. విభజనతో ఏపీ నష్టపోయిందని చెప్పారు.నేను యూ టర్న్ తీసుకోలేదు. మీరు యూ టర్న్ తీసుకొన్నారు. ఏం హమీ ఇచ్చారు.. కళంకిత రాజకీయనేతలతో మీరు అంటకాగుతున్నారని మోడీపై బాబు విమర్శలు గుప్పించారు. ప్రధానిగా ఉంటూ ఇలా మాట్లాడొచ్చా అని బాబు ప్రశ్నించారు. 

హైద్రాబాద్‌ నా మానసపుత్రికగా బాబు చెప్పారు. ఎంతో తపనతో హైద్రాబాద్‌ను అభివృద్ధి చేసినట్టు బాబు చెప్పారు. ప్రత్యేకహోదా విషయంలో 14వ, ఆర్థిక సంఘం పేరుతో తప్పుదోవపట్టిస్తున్నారని బీజేపీపై బాబు పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

మా మనోభావాలను దెబ్బతీయొద్దని మోడీకి చెప్పాను..125 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని బాబు గుర్తు చేశారు.
అవినీతిని సహించబోమంటూ గాలి అనుచరులకు టికెట్లు ఇచ్చారని, వైసీపీ ట్రాప్‌లో పడ్డారని మోదీ తనతో అన్నారని, తానెప్పుడూ తప్పుచేయనని మోదీతో చెప్పానని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని ఆ మాటలు అనడం ఏపీ ప్రజలను అవమానించడమేనని, నిన్న జగన్‌ కోర్టులో ఉంటే తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో ఉన్నారని వైసీపీని చంద్రబాబు ఎద్దేవా చేశారు

 


 

click me!