దేశంలో ఏపార్టీపై లేనంత ఆగ్రహం టీడీపీపై ఉంది: జీవీఎల్

Published : Sep 18, 2018, 06:40 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
దేశంలో ఏపార్టీపై లేనంత ఆగ్రహం టీడీపీపై ఉంది: జీవీఎల్

సారాంశం

 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. వైజాగ్‌ -చెన్నై కారిడార్‌ ఖర్చులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా కూడా వెచ్చించలేదని జీవీఎల్ స్పష్టం చేశారు.

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. 

వైజాగ్‌ -చెన్నై కారిడార్‌ ఖర్చులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా కూడా వెచ్చించలేదని జీవీఎల్ స్పష్టం చేశారు. వైజాగ్‌-చెన్నై కారిడార్‌ ఖర్చులు రాష్ట్రం ప్రభుత్వ భరిస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు చెప్పెవన్నీ అబద్ధాలేనని విమర్శించారు.

మరోవైపు రాష్టా‍నికి కంటే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పడం దారణమన్నారు. చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. 

బాబ్లీ విషయంలో ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నోటీసులను కూడా రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమన్నారు. దేశంలో ఏపార్టీపై లేనంత ఆగ్రహం టీడీపీ పై ప్రజలకు ఉందని ఈ విషయం ఇటీవల ఓ జాతీయ సర్వేల్లో వెల్లడైందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోతుందని జీవీఎల్‌ జోస్యం చెప్పారు.  

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే