
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు (telugu regional parties) బీజేపీ (bjp) అంటే భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు (gvl narasimharao) . శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ బుల్డోజర్ మన రాష్ట్రాల్లోకి వస్తుందని , ఇక తమకు రాజకీయ భవిష్యత్ వుండదని కొందరు ప్రాంతీయ పార్టీల అధినేతలు కంగారు పడుతున్నారని జీవీఎల్ కామెంట్ చేశారు. కేంద్రం, రాష్ట్రాల అభివృద్ధికి సహరిస్తున్నా .. విమర్శించడం ఏంటని ఆయన మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ (ktr) ప్రధానిపై హద్దు మీరి మాట్లాడారని నరసింహారావు ఫైరయ్యారు. కేంద్రాన్ని, నరేంద్ర మోడీని (narendra modi) , బీజేపీని ధూషిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. పీకే హస్తం గూటికి వెళితే టీఆర్ఎస్ (trs), వైసీపీలు (ysrcp) కాంగ్రెస్‌తో (congress) కలుస్తాయా అని జీవీఎల్ ప్రశ్నించారు.
కొద్దిరోజుల క్రితం నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లాపై (palnadu district) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాకు పలు కేంద్ర సంస్థలు తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలోనే నిధులు వస్తున్నాయని పేర్కొన్న ఆయన.. వీటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ వైకాపా ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని ఆరోపించారు. నరసరావు పేటలో జీవీఎల్.. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లాను జీవీఎల్ నరసింహరావు సందర్శించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ను కలిసి పలు విషయాల గురించి మాట్లాడారు. పల్నాడు జిల్లా ఏర్పాటు తర్వాత జిల్లా అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని జిల్లా యంత్రాంగానికి తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, నకరికల్ నుంచి నరసరావుపేట వరకు రైల్వే ట్రాక్ ఏర్పాటు, అంతేకాకుండా పల్నాడు ప్రాశస్త్యాన్ని తెలిపే విధంగా పర్యాటక అభివృద్ధి, పల్నాడు చరిత్రను తెలిపే విధంగా తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించి చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాలతో పాటు , కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు తన సహాయ సహకారాలు అందిస్తానని జీవీఎల్ నరసింహరావు వెల్లడించారు.