ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారి దోపీడీ: బంగారం, నగదును దోచుకున్న దుండగులు

By narsimha lodeFirst Published Dec 25, 2022, 9:32 AM IST
Highlights


ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బంగారం వ్యాపారుల నుండి దుండగులు  700 గ్రాముల బంగారం,  రూ.21 లక్షల నగదును దోచుకున్నారు. కారులో ఉన్న కిలో బంగారం సహా  మరో రూ. 14 లక్షల నగదును దుండగులు గుర్తించలేదు.

ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో   బంగారం వ్యాపారులను అడ్డగించి దోపీడీ పాల్పడ్డారు దుండగులు.  వ్యాపారుల  నుండి  దోపీడీకి పాల్పడిన ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.  ఉమ్మడి కర్నూల్  జిల్లాలోని నంద్యాల నుండి  ఉమ్మడి  గుంటూ రు జిల్లాలోని  నరసరావుపేటకు  బంగారాన్ని తీసుకెళ్తున్న సమయంలో  ఈ ఘటన చోటు  చేసుకుంది. బంగారం వ్యాపారులు  కారులో  బంగారాన్ని తరలిస్తున్న విషయాన్ని గుర్తించిన దుండగులు   ప్రకాశం జిల్లాలోని అటవీ ప్రాంతంలో  దారిదోపిడీకి పాల్పడ్డారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని  గిద్దలూరు అటవీ ప్రాంతంలో  బంగారం వ్యాపారులు  ప్రయాణీస్తున్న కారును దుండగులు నిన్న రాత్రి  అడ్డగించారు.  కారులో  బంగారం వ్యాపారుల నుండి  700 గ్రాముల  బంగారంతో పాటు  రూ. 21 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. కారు డాష్ బోర్డులో  ఉన్న కిలో బంగారంతో పాటు  రూ. 14 లక్షలను   దుండగులు గుర్తించలేదు.  దీంతో బంగారం వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.బంగారం వ్యాపారులు  ఈ విషయమై   పోలీసులకు సమాచారం ఇచ్చారు.   బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దుండగుల కోసం  గాలింపు చర్యలు చేపట్టారు. 

click me!