వైసీపీ పతనం మొదలైంది:కేబినెట్ పునర్వవ్యవస్థీకరణపై బీజేపీ ఎంపీ జీవీఎల్

By narsimha lode  |  First Published Apr 11, 2022, 7:34 PM IST

కేబినెట్ ను పునర్వవ్యవస్థీకరణతో ఏపీ రాష్ట్రంలో వైసీపీ పతనం మొదలైందని బీజేపీ విమర్శించింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఈ విషయమై ఇవాళ మీడియాతో మాట్లాడారు.


అమరావతి: ఏపీ రాష్ట్ర మంత్రివర్గ పునర్వవ్యవస్థీకకరణతో వైసీపీ పతనం మొదలైందని BJP ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు.మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో చోటు దక్కకపోవడంతో వైసీపీ  ప్రజా ప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

సోమవారం నాడు GVL Narasimha Rao మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీలో అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయని అర్ధమైందన్నారు. నిన్నటి వరకు మాకు ఒక్కడే నాయకుడు అని డప్పులు కొట్టుకున్న అధికార పార్టీ నేతలు ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ఒకే మాట ఒకే బాట అన్న నాయకులు నేడు పదవులకు ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్నారన్నారు. ఇవన్నీ చూస్తుంటే YCP పతనం మొదలైందని అర్ధమౌతుందని జీవీఎల్ విమర్శించారు.

Latest Videos

ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వైసిపి నేతలు పలువురు గైర్హాజరయ్యారన్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు రోడ్లపై ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మాజీ హోమ్ మంత్రి సుచరిత రాజీనామా  చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మాజీ మంత్రులు అందరూ అలక బునారన్నారు. మంత్రి వర్గ ఏర్పాటులో YS Jagan పాటించిన విధానమేమిటని ఆయన ప్రశ్నించారు. 

మంత్రులను తొగించడంలో సలహదారుడికి అధికారమెక్కడుందని పరోక్షంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddyపై విమర్శలు చేశారు. ప్రధాన సలహా దారు రాజ్యాంగ బద్ధమైన పదవి కాదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న వారిని మంత్రి పదవుల నుండి తొలగిస్తే వారు ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతారని ఆయన ప్రశ్నించారు.

కమ్మ,బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాలకు చెందిన కొడాలి నాని, ఎల్లంపల్లి, శ్రీరంగణధారాజు లను సామాజికంగా అణగ దొక్కారని ఆయన  అభిప్రాయపడ్డారు.నిజమైన సాధికారత అంటే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయడం. ఆ దమ్ము మీకు ఉందా అంటూ ఆయన మండిపడ్డారు.

click me!