ఏపీ సీఎం వైఎస్ జగన్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సోమవారం నాడు భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను మంత్రి పదవి కోసం ఏనాడూ కూడా పాకులాడలేదన్నారు.
అమరావతి: మంత్రి పదవి కోసం తాను ఏనాడూ కూడా పాకులాడలేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పార్టీ ఏ పదవిని ఇచ్చినా సమర్ధవంతంగా పనిచేస్తానన్నారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఎవరికైనా కొంత బాధ ఉంటుందున్నారు.
ఏపీ సీఎం YS Jaganతో సమావేశం ముగిసిన తర్వాత Balineni Srinivasa Reddy సోమవారం నాడు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలోనే మంత్రి పదవిని వదిలేసుకొని వచ్చానని ఆయన గుర్తు చేసుకొన్నారు. మంత్రి పదవుల కేటాయింపు అనేది సీఎం ఇష్టమన్నారు. మంత్రి పదవి కోసం తాను ఏనాడూ కూడా పాకులాడలేదన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే తాను MLA పదవికి రాజీనామా చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.అంతేకాదు పార్టీ మారుతానని వస్తున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదన్నారు.
YS Rajasekhara Reddy, వైఎస్ జగన్ కు తాము విధేయులమన్నారు. ప్రకాశం జిల్లాలో Aadimulapu Suresh ను మంత్రిగా కొనసాగిస్తే తనకు కూడా మంత్రి పదవిని ఇవ్వాలని తాను కోరినట్టుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. గతంలో సురేష్ తాను కూడా మంత్రివర్గంలో ఉన్నామన్నారు. సురేష్ ఏనాడూ కూడా జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. తన శాఖ మినహా ఇతర వ్యవహరాలను సురేష్ పట్టించుకోలేదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. సురేష్ తో తనకు ఏనాడూ కూడా విబేధాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లా నుండి అత్యధిక స్థానాల్లో YCPని గెలిపిస్తామని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా ఆ బాధ్యతలను నిర్వహిస్తానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని రాజీనామాలు చేసిన ప్రజా ప్రతినిధులంతా తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తాను సీఎం ను ఏ పదవి ఇవ్వాలని కూడా అడగలేదన్నారు. ఈ నెల 22న ఒంగోలులో మ:హిళా సాధికారిత కార్యక్రమం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కోరారన్నారు. అందుకు తాము సంసిద్దతను వ్యక్తం చేసినట్టుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఇవాళ ప్రమాణం చేసిన25 మంది కొత్త మంత్రులంతా సమర్ధులేనని ఆయన అభిప్రాయపడ్డారు. వీరంతా కూడా సీఎం జగన్ కు మంచి పేరు తీసుకువస్తారని తాను భావిస్తున్నట్టుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, లకు 70 శాతం పదవులు వచ్చాయంటే వైసీపీయే కారణమన్నారు. మంత్రిపదవి రాలేదని అసంతృప్తి చెందే వారంతా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు.పార్టీ కుటుంబం వంటిందన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కూడా కట్టుబడి ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్తీకరించారు.11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించారు. 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. తొలుత అంబటి రాంబాబు ప్రమాణం చేశారు. చివరకు విడుదల రజ.ని మంత్రిగా ప్రమాణం చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు.