మంత్రివర్గంలో దక్కని చోటు: సామినేనితో మోపిదేవి భేటీ

Published : Apr 11, 2022, 06:02 PM ISTUpdated : Apr 11, 2022, 06:11 PM IST
మంత్రివర్గంలో దక్కని చోటు: సామినేనితో మోపిదేవి భేటీ

సారాంశం

జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సోమవారంనాడు భేటీ అయ్యారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఉదయభాను అసంతృప్తితో ఉన్నారు. ఉదయబానును బుజ్జగించేందుకు మోపిదేవి భేటీ అయ్యారు.

విజయవాడ: మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో మాజీ మంత్రి, ఎంపీ Mopidevi Venkatarama సోమవారం నాడు భేటీ అయ్యారు. 

నామినేటేడ్ పదవులు పొందిన కొందరు నేతలు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని జగ్గయ్యపేట ఎమ్మెల్యే Samineni Udayabhanuతో ఎంపీ మోపిదేవి వెంకటరమణ భేటీ అయ్యారు. కేబినెట్ పునర్వవ్యవస్థీకరణలో కృష్ణా జిల్లా నుండి జోగి రమేష్ కు చోటు కల్పించారు. 

గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి కొడాలి నాని, పేర్ని నానిలకు కేబినెట్ లో చోటు దక్కింది. అయితే ఈ దఫా ఈ ఇద్దరిని తప్పించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి జోగి రమేష్ కు మాత్రమే అవకాశం కల్పించారు.మంత్రివర్గం పునర్వవ్యవస్థీకరణపై ఉదయభాను ఆశలు పెట్టుకున్నారు.

 కొందరు నేతల కారణంగానే తనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఉదయభాను తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఉదయభాను అనుచరులు నిరసనకు దిగారు. అయితే తన అనుచరులను వారించారు ఉదయభాను. ఈ పరిస్థితుల నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ భానుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. అసంతృప్తితో ఉన్న బానును మోపిదేవి బుజ్జగించారు. 

ఈ భేటీ ముగిసిన తర్వాత మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. సీనియారిటీకి సీఎం జగన్ గౌరవం ఇస్తారని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారికి  నాయకత్వం అండగా ఉంటుందని చెప్పారు. మంత్రివర్గంలో చోటు ఆశించిన వారికి కొంత అసంతృప్తి కలిగిన మాట వాస్తవమేనన్నారు. 

వచ్చే రెండేళ్ల తర్వాత ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో  పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు గాను అవసరమైన టీమ్ ను సీఎం జగన్ సిద్దం చేసుకొంటున్నారు.ఈ క్రమంలోోనే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి  మంత్రివర్గం నుండి తప్పించిన వారికి బాధ్యతలు అప్పగించనున్నారు. మరోవైపు ఆయా సామాజికవర్గాలను తమ వైపునకు ఆకర్షించేందుకు గాను ఏపీ సీఎం జగన్  కబినెట్ పునర్వవ్యవస్థీకరణ చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అగ్రవర్ణాల కంటే బీసీలు ఇతర సామాజిక వర్గాలకు జగన్ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణలో పెద్దపీట వేశారరు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్తీకరించారు.11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించారు. 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. తొలుత అంబటి రాంబాబు ప్రమాణం చేశారు. చివరకు విడుదల రజ.ని మంత్రిగా ప్రమాణం చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది.  సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు.అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు  వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత రాజీనామా చేస్తానని ప్రకటించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనను బుజ్జగించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే