చంద్రబాబు ఏపికి ముఖ్యమంత్రి కాదు...ముఖ్య'కంత్రి': జీవిఎల్

By Arun Kumar PFirst Published Oct 6, 2018, 5:15 PM IST
Highlights

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి నాయకులు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ను అవినీతిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిపారని బిజెపి ఎంపి జీవిఎల్ నరసింహా రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి బండారం ఎక్కడ బైటపడుతుందో అని ఐటీ సోదాలపై గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. గుమ్మడి కాయల దొంగల మాదిరిగా పన్ను ఎగవేతదారులపై ఐటీ దాడులు జరుగుతుంటే తెలుగు దొంగలు ఉలిక్కి పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏటూరులో బిజెపి పార్టీ నిర్వహించిన ప్రజా ఆవేదన ధర్నాలో జీవిఎల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...చంద్రబాబును ముఖ్యమంత్రి అనే కంటే ముఖ్య'కంత్రి' అనడమే సమంజసంగా ఉంటుందన్నారు. 

పన్ను ఎగవేతదారులపై ఐటీ దాడులు జరిగితే హుటాహుటిన కేబినెట్ మీటింగ్ నిర్వహించడం సిగ్గుచేటని జీవిఎల్ అన్నారు. ఇది కేబినెట్ మీటింగ్ లా కాకుండా మాఫియా సమావేశంలా సాగిందన్నారు. తెలుగు దేశం పార్టీ కాస్త మాపియా పార్టీ మారిపోయిందని జివిఎల్ మండిపడ్డారు. దోపిడీదారులకు ఎపి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 

ఈ ధర్నాలో మాజీ మంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ...రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో వారే తెలుగు దేశం ప్రభుత్వానికి బుద్ది చెబుతారని ఆమె అన్నారు.

click me!