ఐటీ దాడుల ఎఫెక్ట్.. వైసీపీలో ఆమంచి..?

By ramya neerukondaFirst Published Oct 6, 2018, 3:07 PM IST
Highlights

ధికార టీడీపీలోని శ్రీమంతులు, వారి బంధువులు, సన్నిహితులై న వ్యాపారులపైనే దాడులు జరుగుతున్న వా తావరణం కన్పించింది. 

టీడీపీ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలోకి జంప్ చేస్తున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఏపీలో టీడీపీ నేతలే లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడుల నేపథ్యంలో ఆమంచి పార్టీ మారుతున్నారంటూ గత రెండు రోజులుగా ప్రచారం ఊపందుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం సాయంత్రం నుంచి ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార టీడీపీలోని శ్రీమంతులు, వారి బంధువులు, సన్నిహితులై న వ్యాపారులపైనే దాడులు జరుగుతున్న వా తావరణం కన్పించింది. ఒంగోలు జిల్లాకు కూడా ఐటీ అధికారులు వచ్చారన్న సమాచారంతో రాజ కీయ వర్గాల్లో ప్రధానంగా టీడీపీలో ఉన్న వ్యాపార ప్రముఖులు కాస్తంత అలజడికి గురయ్యారు. 

ఇదేసమయంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీ అధినేత జగన్‌ను హైదరాబాద్‌లో లోటస్‌ పాండ్‌లో కల బోతున్నారని సోషల్‌ మీడియాలో ఒక పోస్టిం గ్‌ వచ్చింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది. అయితే..దీనిపై ఆమంచి ఆ తర్వాత వివరణ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పారు. తాను టీడీపీలోనే కొనసాగనున్నట్లు తెలిపారు. 

click me!