ఏసీబీ పరిధిలోకి ప్రజా ప్రతినిధులను తేవాలి: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

By narsimha lode  |  First Published Jun 2, 2022, 12:08 PM IST

రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీ ప్రభుత్వాన్ని డిమాడ్ చేశారు. ఇవాళ ఆయన  మీడియాతో మాట్లాడారు. 
 


అమరావతి: Rushikonda తవ్వకాలపై Supreme Court ఆదేశాలను ప్రభుత్వం కచ్చితంగా పాటించాలని బీజేపీ ఎంపీ GVL Narasimha Rao డిమాండ్ చేశారు. 

గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.టూరిజం అభివృద్ది అంటూనే  అక్కడ ఏదో స్కెచ్ వేసినట్టుగా అనుమానం కలుగుతుందన్నారు.రుషికొంద తవ్వకాలను కేంద్ర  టూరిజం శాఖ పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. రుషికొండలో ప్రైవేట్ ప్రాపర్టీ కోసం ప్రయత్నాలు చేస్తే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. 
ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను ACB  పరిధిలోకి తెస్తే అవినీతి బయటపడుతుందన్నారు.ఈ విషయంలో. ప్రభుత్వం తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని ఆయన కోరారు.

Latest Videos

undefined

విశాఖపట్టణంలోని రుషికొండలో రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఈ నెల 1న ఆదేశించింది. కొత్తగా తవ్వకాలు చేపట్టిన ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రుషికొండలో తవ్వకాలపై సుప్రీంకోర్టులో లో బుధవారం నాడు విచారణ నిర్వహించింది. రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ లో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ మే 6న ఆదేశాలు జారీ చేసింది.  ఎన్‌జీటీ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.  దీంతో ఈ విషయమై సుప్రీంకోర్టులో  జస్టిస్ గవాయ్ , జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసం విచారణ నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు విన్పించారు. 

రుషికొండలో ఆరు ఎకరాలు ఉండగా 8.2 ఎకరాల్లోనే నిర్మాణాలున్న విషయాన్ని సింఘ్వి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. గతంలో రిసార్ట్స్ ఉన్న ప్రాంతంతో పాటు మరింత విస్తరిస్తామన్నారు. రుషికొండ విస్తరణ విషయమై సింఘ్వితో సుప్రీంకోర్టు ధర్మాసనం విబేధించింది. గతంలో రిసార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే నిర్మాణాలు చేయాలని ఆదేశించింది.

also read:విశాఖ రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ స్టే.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పనులు నిలిపివేయాలని ఆదేశం..

రుషికొండను తవ్వారని రఘురామకృష్ణంరాజు న్యాయవాది బాలాజీ శ్రీనివాస్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. రుషికొండ తాజా ఫోటోలను ఆయన ధర్మాసనం ముందుంచారు. ఇదే విషయమై ఏపీ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉందని కూడా రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది చెప్పారు. నిర్మాణాలకు అనుమతిస్తే పర్యావరణ ముప్పులేకుండా చేపడుతారా ప్రశ్నించింది. అయితే అనుమతుల ప్రకారమే నిర్మాణాలు చేపడుతామని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.

రుషికొండలో కాలుష్య రహిత వాతావరణం అందించే బాధ్యత అందరిపై ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. హైకోర్టు ఎలాంటి నిబంధనలు విధించినా అందరూ కట్టుబడి ఉండాలని సూచించింది. ఎన్జీటీ అవసరమనుకొంటే హైకోర్టు మరో నిపుణుల కమిటీని కూడా నియమించుకోవచ్చని కూడా సూచించింది.తన వాదనలను హైకోర్టులోనే చెప్పాలని రఘురామకృష్ణంరాజుకు సూచించింది సుప్రీంకోర్టు. దీనిపై విచారణను తర్వగా పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది సుప్రీంకోర్టు. 

click me!