
విశాఖపట్నం రైల్వే జోన్‌కు (Visakha Railway zone) సంబంధించి బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు (GVL Narasimha Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే విశాఖ రైల్వే ప్రత్యేక జోన్ సాకారం కానుందని తెలిపారు. ప్రత్యేక జోన్‌కు పూర్తిస్థాయి ఏర్పాట్లు త్వరలోనే ప్రారంభం అవుతుందని అన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రాజెక్టు రిపోర్టు రెడీ అయిందని చెప్పారు. విశాఖ రైల్వే జోన్‌కు భవన నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభం అవుతందని తెలిపారు. తాను ఈరోజు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను (Ashwini Vaishnaw) కలిసి మాట్లాడినట్టుగా చెప్పారు. త్వరలోనే ప్రక్రియ ప్రారంభం కానున్నట్టుగా ఆయన చెప్పారని వెల్లడించారు. ఇది ఏపీకి, విశాఖ వాసులకు నిజంగానే శుభవార్త అని అన్నారు.
రైల్వే బోర్డు వాస్తవంగా జోన్లను తగ్గించాలనే ఆలోచనలో ఉందన్నారు. విశాఖ రైల్వే జోన్ రైల్వేస్‌కు నష్టం కలిగించే ప్రతిపాదన అయినప్పటికీ.. మోదీకి ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలనే ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు. డీపీఆర్ త్వరలోనే ఆమోదింపబడి పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గత మూడు నాలుగేళ్లుగా పన్నులు రూపంలో ఏపీ నుంచి కలెక్ట్ చేసిన మొత్తం కంటే.. ఎక్కువ మొత్తాన్ని రాష్ట్రానికి ఇచ్చిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించని కారణంగా.. ఆరు రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయాని చెప్పారు. ఎలాగైనా నిధులు సమీకరించి.. వాటిని ముందుకు తీసుకెళ్లాలని రైల్వే మంత్రిని కోరినట్టుగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణకు ముందుకు రావాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరడం జరిగిందన్నారు. విశాఖపట్నం నుంచి వారణాసి మధ్య రైలును నడపాలని ఆయనను కోరినప్పుడు సానుకూలంగా స్పందించారని చెప్పారు. దానిని పరిశీలిస్తానని భరోసా ఇవ్వడం జరిగిందన్నారు.
ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయనే వైసీపీ విజయసాయి రెడ్డి చెప్పారని.. ఇది పూర్తి అబద్దమని తెలిపారు. ప్రత్యేక హోదాకు, పరిశ్రమల రాయితీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. గతంలో టీడీపీ ఇదే చేసిందని విమర్శించారు. రాజకీయం కోసం తమను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలకు గతంలో టీడీపీ అన్యాయం చేసిందని, ఇప్పుడు వైసీపీ అన్యాయం చేస్తుందని తెలిపారు.
విభజన సరైన రీతిలో చేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ప్రధాని మోదీ పార్లమెంట్‌లో చెప్పారని జీవీఎల్ నర్సింహారావు అన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ ఎలా అప్రజాస్వామ పద్దతులు పాటించిందో మోదీ వివరించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూ స్థాపితం చేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్ పుట్టక ముందు, తెలంగాణ సీఎం కేసీఆర్.. టీడీపీలో ఉన్నప్పుడే.. తెలంగాణను సమర్దించిన పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పారు. జాతీయ నాయకులపై వ్యాఖ్యలు చేయడం దారుణం అని అన్నారు.