రాబోయేది గడ్డుకాలమే, అవినీతి చిట్టా బయటపెడతాం : టీడీపీకి బీజేపీ ఎంపీ జీవిఎల్ వార్నింగ్

Published : May 18, 2019, 05:30 PM IST
రాబోయేది గడ్డుకాలమే, అవినీతి చిట్టా బయటపెడతాం : టీడీపీకి బీజేపీ ఎంపీ జీవిఎల్ వార్నింగ్

సారాంశం

టీడీపీ ఓటమి తర్వాత టీడీపీ అవినీతి చిట్టా బయటపెడతామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకున్నా ఇక దాగదన్నారు. అధికార దుర్వినియోగంతో చంద్రబాబు అవినీతిని ఆపగలిగారన్నారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ నేతలకు గడ్డుకాలంగా పరిగణించబోతుందని హెచ్చరించారు. 

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధించడం ఖాయమన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఐదేళ్లపాటు మోదీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మళ్లీ ఆయన ప్రభుత్వానికే పట్టం కట్టనున్నారని తెలిపారు. 

ఐదేళ్లపాటు అహర్నిశలు శ్రమించిన ప్రధానిగా మోదీకి పేరుందన్నారు. ప్రస్తుతం ఓట్ల శాతాన్ని చూస్తుంటే బీజేపీకి అనుకూలమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇకపోతే ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమన్నారు. 

టీడీపీ ఓటమి తర్వాత టీడీపీ అవినీతి చిట్టా బయటపెడతామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకున్నా ఇక దాగదన్నారు. అధికార దుర్వినియోగంతో చంద్రబాబు అవినీతిని ఆపగలిగారన్నారు. 

రాబోయేది తెలుగుదేశం పార్టీ నేతలకు గడ్డుకాలంగా పరిగణించబోతుందని హెచ్చరించారు. కేవలం డబ్బుతోనే ఎన్నికలను శాసించవచ్చునని టీడీపీ నేతల భావన తప్పు అని ప్రజల తీర్పు చూసి అర్థమవుతుందన్నారు.   

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్