చంద్రబాబు!జాగ్రత్తగా ఉండు అంటున్న సోమువీర్రాజు

First Published 3, Aug 2018, 1:47 PM IST
Highlights

భగవంతుడు పై నుంచి అన్నీ చూస్తున్నాడని.. పంచభూతాలే సాక్ష్యమని.. చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని సోము వీర్రాజు హితవు పలికారు. 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.  రాష్ట్రంలో చంద్రబాబు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ పాలనపై విరుచుకుపడ్డారు.

భగవంతుడు పై నుంచి అన్నీ చూస్తున్నాడని.. పంచభూతాలే సాక్ష్యమని.. చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని సోము వీర్రాజు హెచ్చరించారు. ఎయిర్‌పోర్టులకు సేకరించిన భూములను ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారని ఆరోపించారు. స్కూల్‌ భవనాలకు రంగులు వేయడంలోనూ అవినీతి జరుగుతోందని సోము వీర్రాజు మండిపడ్డారు.

అవినీతి సీఎం చంద్రబాబు విషయంలో గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ఆలయాల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబును బర్తరఫ్ చేసే అంశాన్ని పరిశీలించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Last Updated 3, Aug 2018, 2:31 PM IST