చంద్రబాబుకి చుక్కలు చూపిస్తాం

First Published 21, Apr 2018, 1:02 PM IST
Highlights

బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
 

రాజమండ్రి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో టీడీపీ, బీజేపీకి మొదలైన వివాదం తారా స్థాయికి చేరింది. ఎన్డీయే కూటమి నుంచి చంద్రబాబు బయటకు వచ్చిన నాటి నుంచి ఇరు పార్టీల నేతలు ఒకరిని మరొకరు విమర్శించుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ విషయంపై తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఈ ఏడాది నుంచి చంద్రబాబుకి చుక్కలు చూపిస్తామన్నారు. చంద్రబాబు చేసిన ధర్మ పోరాట దీక్షకు దాదాపు రూ.30వేలు ఖర్చు చేశారన్నారు.మొదటి నుంచి చంద్రబాబుకి మోదీ ప్రధాని అవ్వడం ఇష్టం లేదని ఆరోపించారు. తమ బీజేపీ అండతోనే  టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. 

బీజేపీ అండతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన అలా చేస్తే తాను కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. అనంతరం బాలకృష్ణపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. బాలయ్య పై గవర్నర్ కి ఫిర్యాదు చేసినట్లు కూడా చెప్పారు.

Last Updated 21, Apr 2018, 1:02 PM IST