చంద్రబాబుకు బహిష్కరణ రత్న అవార్డు:ఎమ్మెల్సీ సోము

By Nagaraju TFirst Published Oct 6, 2018, 5:52 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతిలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. శనివారం ఏలూరులో బీజేపీ ప్రజా ఆవేదన ధర్నాలో పాల్గొన్న ఆయన టీడీపీపై విరుచుకుపడ్డారు. 

ఏలూరు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతిలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. శనివారం ఏలూరులో బీజేపీ ప్రజా ఆవేదన ధర్నాలో పాల్గొన్న ఆయన టీడీపీపై విరుచుకుపడ్డారు. 

ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకూ అందరూ కొన్ని తరాలకు సరిపడే సొమ్మును సంపాదించుకున్నారని విమర్శించారు. అవినీతిలో ఏపీని చం‍ద్రబాబు నెంబర్‌ వన్‌ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతికి బహిష్కరణ రత్న అవార్డు ఇవ్వాలని ధ్వజమెత్తారు. 

చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతికి అడ్డే లేకుండా పోతుందని మండిపడ్డారు సోము వీర్రాజు. సర్వ శిక్ష అభియాన్‌లో 3,500 పాఠశాలలకి రంగులు వేయడానికి రూ.3కోట్లు ఖర్చుకాగా, దానికోసం రూ.120కోట్లు రూపాయల జీవో ఇచ్చారని ఆరోపించారు. పోలవరం ఆర్‌ఆర్‌ ప్యాకేజీలో జంగారెడ్డిగూడెం మండలంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. 

నీరు చెట్టు పథకం కింద రూ.13వేల కోట్లతో రాష్ట్రంలో మట్టి తవ్వేశామంటున్న ప్రభుత్వం అందులో అవినీతి కనబడటం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబుని మించిన నటుడు ఎక్కడా లేడని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మళ్లీ అన్ని పథకాలకు ఆయన పేరు పెడుతున్నారన్నారు. తొందరలోనే చంద్రబాబును ప్రజలు తరిమికొడతారని చెప్పారు. 
  

click me!