రైతుల సమస్యలు:ఏపీలో బీజేపీ ఆందోళన

By narsimha lodeFirst Published Jun 8, 2021, 12:40 PM IST
Highlights

రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతలు మంగళవారం నాడు ఆందోళనకు దిగారు. 

అమరావతి: రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతలు మంగళవారం నాడు ఆందోళనకు దిగారు. ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఏపీకి చెందిన బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని  కమలదళం నేతలు ఆరోపిస్తున్నారు.

రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వంగా చెప్పుకొంటున్న వైసీపీ నేతలు ధాన్యం  కొనుగోలు విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నించారు.  ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో బీజేపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. 

రైతులకు ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.  రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమౌతున్నా రైతులకు విత్తనాలు, ఎరువులను  అందుబాటులో ఉంచాలని  ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

click me!