జగనన్న తోడు పథకం: రెండో విడత నిధుల విడుదల చేసిన ఏపీ సీఎం

By narsimha lode  |  First Published Jun 8, 2021, 12:04 PM IST

జగనన్నతోడు పథకం కింద రెండో విడత నిధులను లబ్దిదారులకు ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు విడుదల చేశారు. చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రూ. 10 వేలను ఈ పథకం కింద అందించనున్నారు.


అమరావతి: జగనన్నతోడు పథకం కింద రెండో విడత నిధులను లబ్దిదారులకు ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు విడుదల చేశారు. చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రూ. 10 వేలను ఈ పథకం కింద అందించనున్నారు.ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 3.7 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ది కలుగుతోందన్నారు. తాను పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లారా చూసినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. బ్యాంకులతో ప్రభుత్వం మాట్లాడి చిరు వ్యాపారులకు ఆర్ధిక సహాయం అందిస్తున్నామని ఆయన చెప్పారు. 

ఈ పథకం కింద ఆర్ధిక సహాయం అందని వ్యాపారులు ధరఖాస్తు చేసుకొంటే  ఆర్ధిక సహాయం అందేలా చర్యలు తీసుకొంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.రుణాలు సకాలంలో చెల్లిస్తే మళ్లీ వడ్డీ లేని రుణాలు అందిస్తామని జగన్ ప్రకటించారు.ఈ పథకం కింద తొలి విడతలో 5.35 లక్షల మందికి రుణ సౌకర్యం అందించినట్టుగా సీఎం చెప్పారు.రెండో విడతలో 3.7 లక్షల మంది చిరు వ్యాపారులకు రెండో విడత కింద లబ్ది పొందనున్నారని జగన్ తెలిపారు.

Latest Videos


 

click me!