కుప్పకూలిన ఇల్లు... త్వరలో పెళ్లి... రోడ్డునపడ్డ కుటుంబం

By Arun Kumar PFirst Published Jun 8, 2021, 11:58 AM IST
Highlights

పురాతన భవనం కుప్పకూలిన ప్రమాదంలో మూడు కుటుంబాలు తృటిలో తప్పించుకోవడంతో ప్రాణ నష్టం జరక్కున్నా ఆస్తినష్టం మాత్రం జరిగింది.  

కడప: త్వరలోనే ఆ ఇంట్లో పెళ్లి. అందుకు కావాల్సిన సామాగ్రిని కొనిపెట్టుకున్నారు. అయితే అంతలోనే దారుణం చోటుచేసుకుంది. వారు నివసించేది పురాతన భవనం కావడంతో అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయి పెళ్లి సామాగ్రి అంతా శిధిలాల కిందపడి పాడపోయింది. ఈ ప్రమాదంలో మూడు కుటుంబాలు తృటిలో తప్పించుకోవడంతో ప్రాణ నష్టం జరక్కున్నా ఆస్తినష్టం మాత్రం జరిగింది.  

 కడప జిల్లాలోని నాగరాజుపేటలోని ఓ పురాతన భవనంలో మూడు కుటుంబాలు నివాసం వుంటున్నాయి. అయితే ఓ కుటుంబంలో త్వరలోనే పెళ్లి వుండటంతో ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరమ్మతుల కోసం భవనంలోని కొంత భాగాన్ని తొలగించారు. దీంతో మిగతా భవనంపై ఒత్తిడి పెరిగిపోయిన అర్థరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. 

read more  మదనపల్లిలో సిలిండర్ పేలి ఇధ్దరు మృతి: మరొకరికి గాయాలు

మొదల ఓ గోడ కూలడంతో భవనంలో నివాసముంటున్న మూడు కుటుంబాలకు చెందిన సభ్యులంతా భయంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భవనం మొత్తం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఇంట్లోని సామాగ్రి మొత్తం శిధిలాల కింద ఉండిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు దక్కినా కట్టుబట్టలతో బయటకు వచ్చిన వారు రోడ్డునపడ్డారు. తమను ఆదుకోవాలని ఈ కుటుంబం మొత్తం ఆవేదనతో వేడుకుంటోంది. 
 

click me!