మోడీపై అనుచిత వ్యాఖ్యలు: కొడాలి నానిని భర్తరఫ్ చేయాలంటూ బీజేపీ ఆందోళన

By narsimha lodeFirst Published Sep 24, 2020, 11:41 AM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుండి భర్తరప్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు, నేతలు గురువారం నాడు విజయవాడలో ఆందోళనకు దిగారు. 

విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుండి భర్తరప్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు, నేతలు గురువారం నాడు విజయవాడలో ఆందోళనకు దిగారు. 

తిరుపతి పర్యటనలో ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిలపై మంత్రి కొడాలి నాని ఈ నెల 23వ తేదీన అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.ఈ వ్యాఖ్యలను  నిరసిస్తూ ఇవాళ రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

also read:టచ్ చేసి చూడండి: భావోద్వేగానికి గురైన కొడాలి నాని

బీజేపీ కార్యకర్తలు ఇవాళ తమ పార్టీ కార్యాలయం నుండి సబ్ కలెక్టరేట్ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లారు. పోలీసులు వారిని మార్గమధ్యలోనే నిలిపివేశారు.  పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకొంది.ఈ తోపులాట సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.

ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇష్టారీతిలో మాట్లాడుతున్న మంత్రి కొడాలి నానిని వెంటనే మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 

click me!