వైసీపీకి టిప్పు సుల్తాన్, కసబ్, అఫ్జల్ గురులే దేశభక్తులు: బిజెపి విష్ణువర్ధన్ సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Jun 18, 2021, 02:09 PM IST
వైసీపీకి టిప్పు సుల్తాన్, కసబ్, అఫ్జల్ గురులే దేశభక్తులు: బిజెపి విష్ణువర్ధన్ సంచలనం

సారాంశం

ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని... ఒకవేళ విగ్రహాన్ని ఏర్పాటుచేసినా తాము తప్పక కూల్చేస్తామని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి హెచ్చరించారు.  

కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను ఆంధ్ర ప్రదేశ్ బిజెపి నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పట్టణంలోని జిన్నా రోడ్డులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని... ఒకవేళ విగ్రహాన్ని ఏర్పాటుచేసినా తాము తప్పక కూల్చేస్తామని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి హెచ్చరించారు.

''టిప్పు సుల్తాన్ విగ్రహంతోనే మీ పతనం మొదలు అవుతుంది. ఇప్పుడు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టి ఆ తర్వాత అఫ్జల్ గురు విగ్రహం కూడా పెట్టడానికి  సిద్ధం అవుతారు. వైసీపీ ప్రభుత్వానికి టిప్పు సుల్తాన్, కసబ్, అఫ్జల్ గురు లాంటి వారే దేశ భక్తుల లాగా కనిపిస్తున్నారు. వీరి చరిత్ర ని పాఠ్య పుస్తకాలలో కూడా చేర్చుతారేమో'' అంటూ మండిపడ్డారు. 

''ప్రొద్దుటూరులో టిప్పు విగ్రహాన్ని ఎలాంటి అనుమతులు లేకండా ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీకి ఏం తెలియదని అంటున్నారు. జిన్నా రోడ్డు సర్కిల్ లో చరిత్రపై చర్చకు ఎమ్మెల్యే రాచమల్లు సిద్ధమా?మీ దగ్గర ఉన్న చరిత్ర పుస్తకాలను తీసుకొని రండి చర్చిద్దాం'' అని సవాల్ విసిరారు. 

''జిన్నా రోడ్డుకు కూడా ఆ పేరుని తొలగించండి. ఓటు బ్యాంకు రాజకీయాలు కొసం టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు వెనుక తప్పకుండా ఒక కుట్ర కోణం ఉంది. ప్రొద్దుటూరు లో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు'' అని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్