చంద్రబాబు ట్రాప్ లో జగన్... మంత్రి నాని వ్యాఖ్యలు కుట్రలో భాగమే: విష్ణువర్ధన్ రెడ్డి

Arun Kumar P   | Asianet News
Published : Sep 23, 2020, 08:48 PM IST
చంద్రబాబు ట్రాప్ లో జగన్... మంత్రి నాని వ్యాఖ్యలు కుట్రలో భాగమే: విష్ణువర్ధన్ రెడ్డి

సారాంశం

 ఆంజనేయ స్వామి విగ్రహం,అంతర్వేది రధం దగ్ధం, అమ్మవారి వెండి సింహాలపై మంత్రి నాని చేసిన వ్యాఖ్యలతో ప్రజలు తిడుతున్నారని బిజెపి నాయకులు అన్నారు.   

విజయవాడ: ఆలయాలు, దేవతా విగ్రహాలపై దాడుల గురించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నానని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లపై మదం ఎక్కినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రిని కదా అని నోటికొచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. 

''ఆంజనేయ స్వామి విగ్రహం, రధం దగ్ధం, అమ్మవారి వెండి సింహాలపై చేసిన వ్యాఖ్యలతో ప్రజలు తిడుతున్నారు. ప్రధాని మోడీ, యోగి ఆదిత్యల జీవితాల గురించి నానికి ఏం తెలుసు? ఇతర వ్యక్తిగత జీవితాలలో దూరి చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటు. నిన్నటి వరకు మంత్రిపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం. ఈరోజు చేసిన వ్యాఖ్యలు తో కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నానికి తొలగించాలంటూ ఆందోళనలు చేపడతాం'' అని వెల్లడించారు. 

''మోదీ, యోగి ఆదిత్య ‌జీవన శైలి తెలుసుకోవాలి. వారి సతీమణి గురించి మాట్లాడటానికి మంత్రికి సిగ్గుండాలి. తిరుమలలో ఉన్న నాని అక్కడున్న వెంకన్న రాయా, బొమ్మా, దేవుడా చెప్పాలి. ప్రభుత్వం కూడా స్పందించి నాని పై చర్యలు తీసుకోవాలి. అలాగే అక్రమంగా అరెస్ట్ చేసిన హిందూ‌ వాదులపై కేసులు కూడా ఎత్తివేయాలి'' అని డిమాండ్ చేశారు. 

''సిఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడం లేదంటే ఆయనపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కనీసం ఖండించక పోగా అవహేళనతో మాట్లాడుతున్నారు. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించే వరకు మా పోరాటం కొనసాగిస్తాం'' అన్నారు. 

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేయాలని చిల్లరగా మాట్లాడుతున్నారన్నారు. సినిమా నిర్మాత కాబట్టి ప్రజాస్వామ్యం కూడా సినిమా అనుకుంటున్నాడేమో అంటూ ఎద్దేవా చేశారు.

''నేడు చేసిన వ్యాఖ్యలు ద్వారా కొడాలి నాని రాజకీయ ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రబాబు జగన్ ట్రాప్ లో పడి 2019లో ఓడిపోయారు. నేడు చంద్రబాబు వేసిన ట్రాప్ లో జగన్ పడినట్లున్నాడు. కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అయ్యింది. విమర్శలు వస్తున్నా కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తున్నారంటే మాకు కుట్ర అనుమానం ఉంది'' అన్నారు. 

read more  జగన్ కు ఏసుక్రీస్తు, నాకు వెంకటేశ్వర స్వామి...: చంద్రబాబు సంచలనం

''ఏపిలో పూటకో భాష, పూటకో వేషం వేసే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అంతర్వేది లో భక్తులు పై కేసులు పెడితే... ఈ పార్టీలు ఎందుకు మాట్లాడలేదు. బిజెపి మాత్రమే హిందూ ఆలయాలపై దాడులకు నిరసనగా పోరాటం చేసింది. టిడిపి పడగొట్టిన ఆలయాల నిర్మాణం చేపడతామని ప్రకటించడం వెనుక  ప్రభుత్వం కుట్ర ఉంది. దేవాదాయ ‌భూములు, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పంచి పెడుతుంది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తన ఇంటి ఎదురు ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేయలేక పోయారు'' అని మండిపడ్డారు. 

''టిటిడి కి చెందిన ఐదు‌వేల కోట్లు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇదే తరహాలో క్రిస్టియన్, ముస్లింల ఆస్తులు తీసుకుని పంచగలరా? బిజెపికి మీలాగా మత రాజకీయాలు చేయడం అలవాటు లేదు. ప్రజలను రెచ్చగొట్టేలా నాని వ్యాఖ్యలు చేస్తే డిజిపి కేసు ఎందుకు పెట్టలేదు. చర్చి మీద రాళ్లు వేశారని 41మందిపై కేసు పెట్టిన పోలీసులకు నాని వ్యాఖ్యలు కనిపించవా?మీ మంత్రి విచ్చలవిడిగా మాట్లాడుతుంటే జగన్ స్పందించరా? భారత రాజ్యాంగం, చట్టాలు కొడాలి నానికి వర్తించవా?'' అని ప్రశ్నించారు.

''సిఎం స్పందించి నాని ని బర్తరఫ్ చేయకుంటే ఆయనను అడ్డుకుంటాం. 24గంటల్లో నానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. కొడాలి నానికి సవాల్ విసురుతున్నాం.. ప్రజా క్షేత్రంలో నీ సంగతి తేలుస్తాం'' అని హెచ్చరించారు. ''చంద్రబాబు సిఎంగా ఉన్న సమయంలో జగన్ ను డిక్లరేషన్ అడగలేదు. ఆ రెండు పార్టీలు తరహాలో మత రాజకీయాలు మేము‌ చేయము. ఇతర మతస్తులు ఎవరైనా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలి. వైసిపి, టిడిపిలు హిందూ ద్రోహులు... సంప్రదాయాలు కొనసాగించాలని మేము కోరుతున్నాం'' అన్నారు. 

''హైదరాబాద్ లో పదేళ్లు ఉండే హక్కు మనకున్నా చంద్రబాబు ముందే వచ్చారు. వైసిపి లో పిచ్చి పట్టిన వారు కొంతమంది మంత్రులుగా ఉన్నారు. కేసీఆర్ సహకారంతో హైదరాబాద్ ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలి. కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదనేది స్పష్టం. మాతో పెట్టుకున్న చంద్రబాబు ఏమయ్యారో.. నాని తెలుసుకోవాలి. కొడాలి నానిని  మంత్రి పదవి నుంచి తప్పించే వరకు‌ బీజెపి ఊరుకోదు'' అని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu