జూనియర్ ఎన్టీఆర్ యంగ్ డైనమిక్ లీడర్.. వారిద్దరి భేటీ భవిష్యత్తులో రాజకీయ మార్పుకు సంకేతం: విష్ణువర్దన్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Aug 22, 2022, 1:53 PM IST
Highlights

కేంద్ర హోం మంత్రి  అమిత్ షా, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ల భేటీ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వెనక మతలబు ఏమిటని..? సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ సాగుతుంది. తాజాగా ఈ భేటీకి సంబంధించి ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కేంద్ర హోం మంత్రి  అమిత్ షా, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ల భేటీ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వెనక మతలబు ఏమిటని..? సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ సాగుతుంది. తాజాగా ఈ భేటీకి సంబంధించి ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీతో తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో రాజకీయ మార్పుకు సంకేతంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ భేటీ తర్వాత వారిద్దరు కూడా ట్వీట్స్ చేయడం జరిగిందన్నారు. ఏం జరగబోతుందనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందన్నారు.

రాజకీయాలు మాట్లాడకపోయిన..  చరిష్మా, అవగాహన కలిగిన యంగ్ డైనమిక్ లీడర్ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. కచ్చితంగా ఎన్టీఆర్ బీజేపీ పాలనను ప్రశంసించి ఉంటారని.. ఆ కోణంలో దీనిని చూడొచ్చని అన్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా ఉందన్నారు. నిన్న తిరుపతిలో కూడా పవన్ ఇదే మాట చెప్పారని అన్నారు. తాము పవన్‌కు వ్యతిరేకంగా వెళ్లమని తెలిపారు. ‘‘పవన్ కల్యాణ్ లక్ష్యం, జూనియర్ ఎన్టీ ఆర్ లక్ష్యం, బీజేపీ లక్ష్యం.. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనేది’’ అని అన్నారు. ఎన్టీఆర్‌కు, పవన్‌కు తాము సమాన గౌరవం ఇస్తామని  చెప్పారు. 

ఇక, ఎన్టీఆర్‌‌తో భేటీ గురించి అమిత్ షా ఓ ట్వీట్ చేశారు. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారక రత్నం జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో కలుసుకోవడం ఆనందంగా ఉంది.. అంటూ అమిత్‌షా ట్వీట్‌ చేశారు.  ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ట్వీట్ చేశారు. ‘‘మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అమిత్ షా జీ. మీరు నాగురించి మాట్లాడిన మాటలకు ధన్యవాదాలు’’ అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. 

click me!