
టీడీపీ, వైసీపీలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ కో ఇంచార్జ్ సునీల్ ధియోధర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడును వద్దని ప్రజలు జగన్‌ను ఎన్నుకుంటే.. ఏపీ పరిస్థితి పెనం మీద నుంచి పోయిలో పడ్డట్టు అయిందని అన్నారు. ఏపీలో అవినీతి మరింతగా పెరిగి పోయిందని విమర్శించారు. తాము 2014లో తమతో కలిసి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని.. అయితే తమకు వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లిపోయాడని విమర్శించారు. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని, బాహుబలి అని.. అలాంటి వ్యక్తికి కూడా చంద్రబాబు కట్టప్పలాగా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తాను ఈ మాట చెప్పడం ఇదే తొలిసారి అని అన్నారు.
Also Read: ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరి.. జగన్ సర్కార్‌పై ప్రశ్నల వర్షం..
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాగానే పనిచేశారని సునీల్ ధియోధర్ అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం పార్టీ మారినప్పటికీ.. వాస్తవాలు మాట్లాడుకోవాలని చెప్పారు. సోము వీర్రాజు హయాంలో ఏపీలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు. ప్రజా పోరు యాత్ర ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. పురందేశ్వరి నేతృత్వంలో మరింత ముందుకు వెళ్తామని అన్నారు. ఏపీలో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: మనవాళ్లే సందేహిస్తున్నారు: బీ టీమ్ వ్యాఖ్యలపై పవన్ సంచలనం..