రాష్ట్రంలో విప్లవం రావాలి..ప్రజాకోర్టులు పెడతాం..బిజెపి సంచలనం

First Published Mar 24, 2018, 9:14 AM IST
Highlights
  • రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తవ్వి తీయటానికి గునపాలు కూడా సరిపోవంటూ ఎద్దేవా చేశారు.

వేళ్ళూనుకునిపోయిన అవినీతిని పెకిలించాలంటే అవినీతి రహిత విప్లవం రావాలంటూ బిజెపి సంచలన ప్రకటన చేసింది. అందుకోసం ప్రజా కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు

శనివారం మీడియాతో ఎంఎల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, ఒకపుడే జాతీయ స్ధాయిలో అవినీతికి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ చేసిన అవినీతి రహిత విప్లవం రాష్ట్రంలో కూడా రావాల్సిన అవసరం ఉందంటూ వీర్రాజు స్పష్టంగా చెప్పారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి జరుగుతోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తవ్వి తీయటానికి గునపాలు కూడా సరిపోవంటూ ఎద్దేవా చేశారు. అవినీతిని పెకిలించటానికి బుల్డోజర్లు కావాల్సిందేనంటూ ధ్వజమెత్తారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం గురించి వివరిస్తూ అందులో జరిగిన అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అసలు పట్టిసీమకు రూ. 1660 కోట్లెందుకు? స్పిల్ వేలో రూ. 1400 ఎందు ఖర్చయిందని నిలదీశారు. ప్రాజెక్టు ప్రాంతంలో మట్టి తవ్వితీయటానికే రూ. 67 కోట్లు ఖర్చు చేయటంపై వీర్రాజు ఆశ్చర్యం వ్తక్తం చేశారు. అవసరం లేకపోయినా రూ. 90 కోట్లు వ్యయం చేసి డయాఫ్రం వాల్ ఎందుకు కట్టారో చెప్పాలంటూ ప్రశ్నించారు.

పెన్షన్లు మంజూరు చేయాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇళ్ళు మంజూరు చేయాలన్నా, లోన్ల సబ్సడీ అందాలన్నా డబ్బులేనా అంటూ మండిపడ్డారు. జన్మభూమి కమిటీలు ఏర్పుటు చేసి అవినీతిని కార్యకర్తల దాకా తీసుకెళ్ళిన వ్యవస్ధ దేశం మొత్తం మీద టిడిపిలోనే సాధ్యమైందన్నారు. చెట్టు-మట్టి పథకం పెట్టి రూ. 4500 కోట్లు ఖర్చు పెట్టి మట్టిని రూ. 10 వేల కోట్లకు అమ్ముకున్నారంటూ వీర్రాజు మండిపడ్డారు. అవినీతి ఏ స్ధాయిలో జరిగిందో చెప్పటానికి కాగ్ నివేదికే సాక్ష్యమని ఎంఎల్సీ అన్నారు.

 

click me!