పథకం ప్రకారం నాపై దాడి: బీజేపీ నేత సత్యకుమార్

Published : Mar 31, 2023, 04:18 PM IST
పథకం ప్రకారం నాపై దాడి: బీజేపీ నేత సత్యకుమార్

సారాంశం

తన పై దాడి వెనుక ఎవరున్నారో  అందరికీ తెలుసునని  బీజేపీ జాతీయ కార్యదర్శి  సత్యకుమార్  చెప్పారు. ఈ విషయంలో  పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన  తప్పుబట్టారు.

గుంటూరు: పథకం ప్రకారం తనపై దాడి  చేశాదరని బీజేపీ  జాతీయ కార్యదర్శి సత్యకుమార్  చెప్పారు.శుక్రవారంనాడు  గుంటూరులో బీజేపీ కార్యాలయంలో  బీజేపీ జాతీయ కార్యదర్శి  సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. తనపై దాడి ఎవరు చేశారో అందరికీ తెలుసునన్నారు.  పోలీసుల అండతోనే  తమపై దాడి జరిగిందని ఆయన  ఆరోపించారు.  తనపై దాడి  జరిగే  సమయంలో  వైసీపీ కార్యకర్తలకు  పోలీసులు సహకరించారని  ఆయన  విమర్శించారు.   తాము వెళ్తుంటే  పోలీసులు అక్కడ ఎందుకు ఉన్నారని  ఆయన  ప్రశ్నించారు.  తనపై దాడిపై  జగన్ పైనే అనుమానం ఉందన్నారు. మూడు రాజధానుల శిబిరంలో  ఉన్న మహిళలపై  తాము దాడి  చేశామని  బాపట్ల ఎంపీ సురేష్ చేసిన ఆరోపణలను  సత్యకుమార్ తీవ్రంగా ఖండించారు.  ప్రశ్నించామని తమపై దాడి  చేశారని  సత్యకుమార్  ఆరోపించారు.  

also read:గుంటూరులో బీజేపీ నేత సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి: కారు అద్దాలు ధ్వంసం

పోలీసులు  తమ పార్టీ కార్యకర్తను బెదిరించే ప్రయత్నం  చేశారని  సత్యకుమార్  చెప్పారు. ఆదినారాయణరెడ్డిని  లక్ష్యంగా  చేసుకొని  వైసీపీ కార్యకర్తలు ఈ దాడి  చేశారన్నారు. తన కాన్వాయ్ లో  ఆదినారాయణరెడ్డి  లేకపోవడంతో  తన కారుపై దాడి  చేశారన్నారు.  ఈ రకమైన  దాడులకు తాము భయపడబోమన్నారు.  వైసీపీ  మాదిరిగా తాము  దిగజారి ప్రవర్తించబోమన్నారు. ఈ విషయమై   డీజీపీకి ఫిర్యాదు  చేసేందుకు  పోన్లు చేస్తే  ఆయన స్పందించడం లేదన్నారు.  ఈ విషయం తెలుసుకుని పలువురు తనకు  ఫోన్  చేసి పరామర్శించారన్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?