సీఎం జగన్ జీవిత లక్ష్యమిదే..! అందుకోసమే ఇదంతా చేస్తున్నాడు : కన్నా లక్ష్మీనారాయణ

By Arun Kumar PFirst Published Mar 31, 2023, 3:45 PM IST
Highlights

అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపిన టిడిపి నాయకులు కన్నా లక్ష్మీనారాయణ  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. 

అమరావతి :దేశంలోనే అత్యంత ధనికుడిగా మారాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారని టిడిపి నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు.అందువల్లే అధికారంలోకి రాగానే ఇసుక వ్యాపారం చేతుల్లోకి తీసుకున్నారని అన్నారు. విశాఖ రాజధాని అంటూ చేస్తున్న హడావుడి కూడా తన వ్యక్తిగత సంపాదనకోసమే అని కన్నా ఆరోపించారు. 

 జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు ఉద్యమం 1200 రోజులకు చేరింది.ఈ సందర్భంగా అమరావతి నిరసన కార్యక్రమాల్లో మాజీ మంత్రి కన్నా సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 

సీఎం జగన్ వ్యాపారాలు మొత్తం పేదట చెమట డబ్బులతో నడుస్తున్నాయని కన్నా అన్నారు. విశాఖను దోచుకోడానికే జగన్ రాజధాని నాటకం ఆడుతున్నాడని... వడ్డించిన విస్తరిలా ఉంది కనుకే దీనిపై పడ్డారన్నారు. ఈ విషయం అర్థమైంది కాబట్టే రాజధానిగా విశాఖపట్నం వద్దు...వైసీపీ అరాచకాలు మేము భరించలేము అంటూ విశాఖవాసులు అంటున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పే ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని కన్నా అన్నారు. 

Read More  గుంటూరులో బీజేపీ నేత సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి: కారు అద్దాలు ధ్వంసం

తన వ్యాపారాలకు అడ్డు వస్తున్న వారిని పోలీసులతో చంపిస్తున్నారని కన్నా ఆరోపించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని... అత్యుత్సహాం ఎక్కువయ్యిందని అన్నారు. ఇకనైనా జగన్ ధనదాహాన్ని ఆపాలని కన్నా సూచించారు. 

గత ఎన్నికల సమయంలో జగన్ కేంద్ర మెడలువంచుతా అంటూ ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారని అన్నారు. ఆ మాటలు నమ్మి అధికారం అప్పగిస్తే రాష్ట్ర భవిష్యత్తుని కట్టకట్టి కృష్ణా నదిలో వేసాడని అన్నారు. సంక్షేమ పథకాల పేరిట ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నాడని మాజీ మంత్రి కన్నా ఆరోపించారు. 

రాజధానిని అమరావతి నుండి తరలించడం సాధ్యం కాదని... ఇక్కడి నుండి ఒక్క చీపురుపుల్ల కూడా తీసుకెళ్లలేరు అని కన్నా అన్నారు. మళ్ళీ ఈ రాజధాని అభివృద్ధి చంద్రబాబు సారథ్యంలోని మొదలవుతుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 

click me!