విజయవాడలో కలకలం.. వినాయకచవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు

Published : Sep 14, 2018, 11:52 AM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
విజయవాడలో కలకలం.. వినాయకచవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు

సారాంశం

వినాయక మండపం వద్ద అర్ధరాత్రి నలుగురు మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 

వినాయక చవితి వేడుకల్లో మహిళలతో అశ్లీలంగా నృత్యాలు చేయించడం ఇప్పుడు విజయవాడలో కలకలం రేపింది. నగర శివార్లలోని నున్నలో కొందరు యువకులు ఈ వికృత చర్యకు పాల్పడ్డారు. ఓ వినాయక మండపం వద్ద అర్ధరాత్రి నలుగురు మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 

నలుగురు మహిళలతో పాటు, ఈ ఘటనతో సంబంధం ఉన్న 8 మంది యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిపై 290,294 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి నృత్య కార్యక్రమాలు విజయవాడలో ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారని పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?