చంద్రబాబు బండారం బయటపెడతాం... జీవీఎల్

Published : Jan 21, 2019, 11:48 AM IST
చంద్రబాబు బండారం బయటపెడతాం... జీవీఎల్

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి బీజేపీ నేత జీవీఎల్ మండిపడ్డారు.  అవినీతి, ఆర్భాటం, ప్రచారం తప్ప ఏపీకి చంద్రబాబు చేసింది ఏమీ లేదని జీవీఎల్  ఆరోపించారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి బీజేపీ నేత జీవీఎల్ మండిపడ్డారు.  అవినీతి, ఆర్భాటం, ప్రచారం తప్ప ఏపీకి చంద్రబాబు చేసింది ఏమీ లేదని జీవీఎల్  ఆరోపించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుంటూరు పర్యటన నేపథ్యంలో.. ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడారు.

ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాలకు చంద్రబాబు పసుపు ముసుగు వేశారని ఆయన విమర్శించారు. త్వరలోనే అన్ని ముసుగులు తొలగించి.. చంద్రబాబు బండారం బయటపెడతామన్నారు. ఏపీలో కేంద్రం చేసిన అభివృద్ధి కాకుండా టీడీపీ ప్రభుత్వం చేసిన కనీసం మూడు పనులు చెప్పాలని సవాల్‌ విసిరారు. 

గృహనిర్మాణంలో  అంతులేని అవినీతికి టీడీపీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేం‍ద్రం మంజూరు చేసిన ఎలక్ట్రానిక్‌ కంపెనీలను చినబాబు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలనుకుంటే, ప్రధానిని అడ్డుకుంటామని బాబు ప్రకటన చేయాలన్నారు . టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. టీడీపీ నేతలు చేసిన అవినీతి, అక్రమాలకు జైలు వెళ్లడానికి సిద్దంగా ఉండాలని జీవిఎల్‌ సూచించారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే