వైఎస్ పై కేసీఆర్ ప్రశంసలు: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

By Nagaraju TFirst Published Jan 21, 2019, 11:22 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పొగడటంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు  గతంలో తెలుగుదేశం పార్టీ ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతిపై విడుదల చేసిన రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకంపై రెండో సంతకం కేసీఆర్ దేనని గుర్తు చేశారు. 

అమరావతి: తెలంగాణ అసెంబ్లీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పొగడటంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు  గతంలో తెలుగుదేశం పార్టీ ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతిపై విడుదల చేసిన రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకంపై రెండో సంతకం కేసీఆర్ దేనని గుర్తు చేశారు. 

ఇప్పుడే కేసీఆర్ అదే వైఎస్ఆర్ ను పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో వైఎస్ ను కేసీఆర్ పొగిడిన విషయాన్ని నేతలతో చర్చించారు. మోడీ డైరెక్షన్లోనే టీఆర్ఎస్, వైసీపీలు కలిశాయని ఆరోపించారు. మరోవైపు దేశ ప్రజలకు కోల్ కతా సభ ఒక భరోసా ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. 

అమరావతిలో దానికి ధీటైన సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అమరావతి సభకు 22 పార్టీల నేతలు హాజరు కానున్నట్లు తెలిపారు. అటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో పర్యటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏం మేలు చేశారని కేంద్రమంత్రి వస్తారని ప్రశ్నించారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటరిచ్చారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరిస్తున్నారని, వాళ్ల బెదిరింపులకు ఇక్కడ భయపడే వాళ్లు ఎవరూ లేరని ఘాటుగా సమాధానం ఇచ్చారు.  

బీజేపీ ఏపీకి ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా చాలా తక్కువ చేసిందని చంద్రబాబు విమర్శించారు. యూపీ రోడ్లుకు ఇచ్చిన నిధుల కన్నా 7 రెట్లు తక్కువ ఏపీకి ఇచ్చారని, మహారాష్ట్ర రోడ్ల కన్నా 4 రెట్లు తక్కువ ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీ రహదారుల అభివృద్ధికి కేవలం రూ.5,399 కోట్లు మాత్రమే ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు. 
ఏపీలో పర్యటించేందుకు వారానికి ఒక కేంద్రమంత్రి వస్తారని, రాష్ట్రానికి ఏం మేలు చేశారని వస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. పైగా బెదిరింపులు కూడా చేస్తున్నారన్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
  

click me!