ప్రజలను మోసం చేస్తున్న జగన్, తీరు మార్చుకోవాలి: పురంధేశ్వరి హితవు

Published : Jul 22, 2019, 08:07 PM IST
ప్రజలను మోసం చేస్తున్న జగన్, తీరు మార్చుకోవాలి: పురంధేశ్వరి హితవు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసినా జగన్ మాత్రం ప్రత్యేక హోదా వస్తుందంటూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. జగన్‌ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసిన పురంధేశ్వరి జగన్‌ తన తీరు ఇకనైనా మార్చుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడం సరికాదని ఆరోపించారు.   

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను జగన్ వంచన చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసినా జగన్ మాత్రం ప్రత్యేక హోదా వస్తుందంటూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. జగన్‌ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసిన పురంధేశ్వరి జగన్‌ తన తీరు ఇకనైనా మార్చుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడం సరికాదని ఆరోపించారు. 

మరోవైపు ఏపీలో త్వరలో ప్రారంభంకానున్న గ్రామ సచివాలయ విధానంపైనా విమర్శలు చేశారు పురంధేశ్వరి. ఎటువంటి విధానాలు అమలు చేసినా రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇసుకపై నిషేధం విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu