శభాష్ మిమ్మల్ని రాష్ట్ర నడిబొడ్డున సన్మానిస్తా : రూట్ మార్చిన కేశినేని నాని, టార్గెట్ వైసీపీ ఎంపీ

By Nagaraju penumalaFirst Published Jul 22, 2019, 6:32 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్ర నడిబొడ్డున మిమ్మల్ని ఘనంగా సన్మానిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోతే మీరు ఏం చేస్తారో కాస్త చెప్పగలరా అంటూ ట్వీట్ ను ముగించేశారు కేశినేని నాని. 

అమరావతి: తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు. సొంత పార్టీ, అధికార పార్టీ అనే తేడా లేకుండా తన ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అటు అధికారులను సైతం వదలడం లేదు కేశినేని నాని. 

తాజాగా మరో కీలక నేతను టార్గెట్ చేశారు ఎంపీ కేశినేని నాని. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. శభాష్ మిథున్ రెడ్డి అంటూ సంబోధిస్తూనే విమర్శలు గుప్పించారు. 

శభాష్ మిథున్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే బాధ్యత మీదే అని ఒప్పుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్ర నడిబొడ్డున మిమ్మల్ని ఘనంగా సన్మానిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోతే మీరు ఏం చేస్తారో కాస్త చెప్పగలరా అంటూ ట్వీట్ ను ముగించేశారు కేశినేని నాని. 

శభాష్ మిథున్ రెడ్డి గారు
ప్రత్యేక హోదా సాధించే బాధ్యత మీదే అని ఒప్పుకున్నందుకు మిమల్ని అభినందిస్తున్నాను .
ప్రత్యేక హోదా సాధిస్తే మిమ్మల్ని రాష్ట్ర నడి బొడ్డులో సన్మానం చేస్తాం .
సాధించలేకపోతే మీరేమి చేస్తారో కొంచం చెప్పగలరా. pic.twitter.com/WQ3iBbtlhu

— Kesineni Nani (@kesineni_nani)

 

మరోవైపు సోమవారం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు కేశినేని నాని. ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఉద్దేశిస్తూ... కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి కొన్ని సూచనలు చేశారు. ‘‘ డీజీపీ గారు కాల్ మనీ మాఫియా వల్ల ప్రజలు  పడే ఇబ్బందులు రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ మీకే తెలుసు. కాల్ మనీ మాఫియా బారిన పేద ప్రజలు పడకుండా కాపాడండి సార్’ అంటూ పోస్టు చేశారు. 
 

డీజీపీ గారు కాల్మని మాఫీయా వల్ల ప్రజలు పడే ఇబ్బందులు ఈ రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువ మీకే తెలుసు కాల్మని మాఫీయా బారిన పేద ప్రజలు పడకుండా కాపాడండి సార్. pic.twitter.com/SUMuQmvbG2

— Kesineni Nani (@kesineni_nani)
click me!