నా వెంట్రుక పీకలేరన్న జగన్.. సీఎంగా వుండి ఆ మాటలేంటీ, క్షమాపణలు చెప్పాల్సిందే : బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి

Siva Kodati |  
Published : Apr 09, 2022, 07:19 PM IST
నా వెంట్రుక పీకలేరన్న జగన్.. సీఎంగా వుండి ఆ మాటలేంటీ, క్షమాపణలు చెప్పాల్సిందే : బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి

సారాంశం

వెంట్రుక కూడా పీకలేరంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి ఫైరయ్యారు. వెంట్రుక పీకడానికి, గుండు కొట్టించుకోవడానికి సీఎం పదవి ఎందుకంటూ ఫైరయ్యారు. జగన్ తక్షణం క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.   

వైసీపీ (ysrcp) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (ys jagan) శుక్ర‌వారం నాటి నంద్యాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చేసిన ‘‘వెంట్రుక కూడా పీకలేరన్న’’ వ్యాఖ్య‌ల‌ు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై క్ష‌మాప‌ణలు చెప్పి తీరాల్సిందేనని బీజేపీ (bjp) నేత, టీటీడీ (ttd) పాల‌క మండ‌లి మాజీ స‌భ్యుడు భాను ప్ర‌కాశ్ రెడ్డి (bhanu prakash reddy) డిమాండ్ చేశారు.  ప్రజాస్వామ్యంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు, పత్రికలకు ప్రశ్నించే హక్కు ఉంటుందన్న గుర్తుచేశారు. అలాంటి వారిని ఉద్దేశించి వెంట్రుక కూడా పీకలేరని జగన్ అనడం బాధాకరమ‌ని భాను ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు

సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసభ్యకర పదజాలం వాడటం బాధాకరమ‌న్నారు. వెంట్రుక పీకడానికి, గుండు కొట్టించుకోవడానికి సీఎం పదవి ఎందుకంటూ ఫైరయ్యారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ఢిల్లీ పెద్దలు ఛీదరించుకుంటున్నారని భాను ప్రకాశ్ రెడ్డి దుయ్యబట్టారు. రూ.3.5 లక్షల కోట్లు అప్పులు చేసిన సీఎం జగన్.. విద్యుత్ అప్పులు ఎందుకు తీర్చలేకపోయారని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ఇకపోతే.. Jagananna Vasathi Deevena  కార్యక్రమం కింద  రెండో విడత 10,68,150 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 1,024 కోట్లు ఏపీ సీఎం YS Jagan  శుక్రవారం నాడు జమ చేశారు. ఈ సందర్భంగా Nandyalలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం విద్యార్ధులకు చిక్కి అందిస్తుందన్నారు. అయితే ఈ చిక్కి విద్యార్ధుల చేతికి అంటకూడదనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం ఈ చిక్కికి  కవర్ చుట్టి అందిస్తున్నామన్నారు. ఈ చిక్కీపై జగన్ ఫోటో ఉందని చంద్రబాబుతో పాటు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ లు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల కోసం చంద్రబాబు సర్కార్ (chandrababu naidu) కంటే గతంలో కంటే ఎంత ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నామో మాత్రం చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలతో  విపక్షాలకు కడుపుమంట, అసూయ కలుగుతుందన్నారు. అసూయకు మందే లేదన్నారు.  అసూయ ఎక్కువైతే బీపీ, షుగర్ తో పాటు గుండెపోటు వస్దుందని జగన్  చెప్పారు. అది అలానే కొనసాగితే ఏదో ఒక రోజు టికెట్ తీసుకుంటారని జగన్ శాపనార్ధాలు పెట్టారు. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఉన్నంత కాలం వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరని ఏపీ సీఎం వైఎస్ జగన్ విపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కేసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడితే వాటికి సహకరించకపోగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (pawan kalyan), ఎల్లో మీడియా ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. రోజుకో కట్టు కథను ప్రచారం చేస్తున్నారన్నారు. పార్లమెంట్ వేదికగా కూడా కట్టుకథలను ప్రచారం చేసి రాష్ట్ర పరువును తీశారని జగన్ టీడీపీపై మండిపడ్డారు. బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా విపక్షాలున్నాయన్నారు. కానీ రాష్ట్రం పరువును పార్లమెంట్ లో తీసే ప్రయత్నాలు  ఆయా రాష్ట్రాల్లో విపక్షాలు చేయలేదన్నారు. ఏపీ రాష్ట్రంలో దౌర్భాగ్యపు విపక్షం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు నాయుడు సర్కార్ ఎగ్గొట్టిన పీజు రీ ఎంబర్స్ మెంట్  బకాయిలను కూడా తమ ప్రభుత్వమే చెల్లించిందని సీఎం జగన్ గుర్తు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu