అమిత్ షాపై అలిపిరి దాడిలో ట్విస్ట్: బిజెపి నేత అరెస్టు

First Published May 22, 2018, 1:30 PM IST
Highlights

బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై అలిపిరి దాడి ఘటనలో అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది.

తిరుపతి: బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై అలిపిరి దాడి ఘటనలో అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబందించిన టీడిపి నాయకుడు సుబ్రమణ్యం యాదవ్ ను అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు తాజాగా బిజెపి నేత కోలా ఆనంద్ ను అరెస్టు చేశారు. 

ఈనెల 11వ తేదీ తిరుమలకు వచ్చిన అమిత్ షా కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కోలా ఆనంద్‌ కుమార్‌(46), ఆయన అనుచరుడు బట్టవాటి రాజశేఖర్‌ అలియాస్‌ రాజ (27 ప్రధాన కారణమని భావించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  వారిని సోమవారం 4వ అదనపు మున్సిఫ్‌ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా బెయిల్‌ మంజూరు చేశారు.
 
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమిత్ షా కాన్వాయ్ వద్ద ఆందోళనకు దిగిన నేపథ్యంలో కోలా ఆనంద్‌ కారు అద్దం పగిలింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన, అతడి అనుచరుడు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీకి అనుబంధమైన టీఎన్‌ ఎస్‌ఎఫ్‌ నాయకుడు సుబ్రమణ్యం యాదవ్‌ను అలిపిరి పోలీసులు అరెస్టు చేయడంతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, దాడికి గురైన తమవారినే అరెస్టు చేశారని తిరుపతి ఎమ్మెల్యే సుగుణ మండిపడ్డారు.
 
టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. దాంతో సుబ్రమ్యం యాదవ్‌కు ఆ రోజే బెయిల్‌ ఇచ్చారు. అదే సమయంలో కోలా ఆనంద్‌ను అరెస్టు చేస్తామని పోలీ సులు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు దంపూరి భాస్కర్‌యాదవ్‌ చేసిన ఫిర్యాదు మేరకు కోలా ఆనంద్‌, ఆయన అనుచరుడు రాజశేఖర్‌ను అలిపిరి పోలీసులు సోమవారం అరెస్టు చేసి కోర్టుకు 
 
అమిత్‌షాపై దాడికి పాల్పడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కోలా ఆనంద్ ప్రశ్నించారు. 

click me!