బీజేపీ అభ్యర్ధులకు ఏం కానివ్వను, ఏమైనా జరిగితే రాజీనామా : ఆదినారాయణ రెడ్డి

Siva Kodati |  
Published : Mar 15, 2020, 02:38 PM ISTUpdated : Mar 15, 2020, 02:41 PM IST
బీజేపీ అభ్యర్ధులకు ఏం కానివ్వను, ఏమైనా జరిగితే రాజీనామా : ఆదినారాయణ రెడ్డి

సారాంశం

స్ధానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేసిన అభ్యర్ధుల బాధ్యత తనదేనని, వారికి ఏమైనా జరిగితే పార్టీకి రాజీనామా చేస్తానన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి.

స్ధానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేసిన అభ్యర్ధుల బాధ్యత తనదేనని, వారికి ఏమైనా జరిగితే పార్టీకి రాజీనామా చేస్తానన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి. ఆదివారం జమ్మలమడుగులో బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సమావేశాలు జారీ చేయొద్దంటూ పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ అభ్యర్ధులు అత్యధికంగా పోటీ చేసిన ఏకైక నియోజకవర్గం జమ్మలమడుగేనని వారి భద్రత కోసమే దేవగుడికి వచ్చారని ఆయన చెప్పారు.

Also Read:ఏపీ స్థానిక ఎన్నికలపై ఈసీ కొరడా: జగన్ కు షాక్, చంద్రబాబుకు ఊరట

తమ అభ్యర్ధులపై వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, అయితే బీజేపీ అభ్యర్ధుల రక్షణపై పూచీ తనదన్నారు. అభ్యర్ధులకు ఏమైనా జరిగితే పార్టీకి రాజీనామా చేస్తానని ఆది స్పస్టం చేశారు.

మరోవైపు శనివారం రాత్రి జమ్మలమడుగులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెడ్డయ్య అనే వ్యక్తి సుగుమంచి పల్లె దారిలో వెళ్తుండగా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేసినట్లుగా బాధితుడు ఆరోపించాడు.

Also Read:కరోనా దెబ్బ: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

తనకు పార్టీలతో సంబంధం లేదని చెప్పినా వినకుండా దాడికి పాల్పడ్డారని రెడ్డయ్య వాపోయాడు. దీంతో అతనిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలంటూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?