వైసీపీ ప్రభుత్వం భయపడుతోంది, అందుకే....: సినీనటి, బీజేపీ నేత కవిత

By Nagaraju penumalaFirst Published Nov 5, 2019, 12:07 PM IST
Highlights

ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు వైసీపీ వెనకడుగు వేస్తోందని మండిపడ్డారు సినీనటి కవిత. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని న్యాయ స్థానాలు చెప్తున్నప్పటికీ ప్రభుత్వం భయపడుతోందని ఆమె విమర్శించారు. 

విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సినీనటి, బీజేపీ నేత కవిత. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని విమర్శించారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు వైసీపీ వెనకడుగు వేస్తోందని మండిపడ్డారు సినీనటి కవిత. 

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని న్యాయ స్థానాలు చెప్తున్నప్పటికీ ప్రభుత్వం భయపడుతోందని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపాలిటీలకు ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఇసుక సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న కవిత ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక సమస్య పరిష్కారంపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

ఇసుక సంక్షోభంతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడినా ప్రభుత్వంలో చలనం కూడా రావడం లేదన్నారు. విపక్ష పార్టీలు ఇంత ఎత్తున పోరాటం చేస్తున్న కనీసం చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు కవిత. 


ఈ వార్తలు కూడా చదవండి

గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పండి: జగన్ పై పురంధేశ్వరి కామెంట్స్

మాపై కేసులు...బిజెపి పై దాడులు...జనసేనపై విమర్శలు...: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

click me!