బీజేపీ నేత మల్లారెడ్డి హత్యకేసులో పుల్లారెడ్డిపై అనుమానం.. కీలక మలుపు...

By SumaBala Bukka  |  First Published Feb 25, 2022, 10:47 AM IST

వారం రోజుల క్రితం అత్యంత దారుణంగా హత్యకు గురైన బీజేపీ నేత లంకెల మల్లారెడ్డి హత్యకేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓ వీడియో వైరల్ గా మారడంతో నిందితుడు అతడేనంటూ కుటుంబసభ్యులు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


విజయవాడ : Krishna Districtలో సుమారు వారం రోజుల క్రితం దారుణ murderకు గురైన BJP నాయకుడు Lankela Mallareddy హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. జగ్గయ్యపేట వైసిపి ఎమ్మెల్యే ఉదయభాను వియ్యంకుడు pullareddyకి ఈ హత్య కేసులో ప్రమేయం ఉండొచ్చని హతుడి బంధువులు, బిజెపి నాయకులు ఆరోపించారు.  తాజాగా పుల్లారెడ్డి, మల్లారెడ్డిని ‘అడ్డంగా నరికేస్తా’ అంటూ బెదిరిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో హతుడి బంధువులు, బిజెపి నాయకుల ఆరోపణలకు బలం చేకూరింది. 

కృష్ణాజిల్లా వత్సవాయి మండలానికి చెందిన బిజెపి నాయకుడు,  విజయవాడ పార్లమెంట్ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి  మల్లారెడ్డి ఈ నెల18వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే హత్య జరిగి వారం రోజులు అవుతున్నా ఇంత వరకు ఈ కేసు విచారణ కొలిక్కి రాలేదని మల్లారెడ్డి కుటుంబీకులు, బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా  పుల్లారెడ్డి, మల్లారెడ్డి నడుమ జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో…‘నా ఇంటి మీదకు  వచ్చేది  ఎవర్రా..  ఎవరైనా వస్తే నిలబెట్టి నరికేస్తా’..  అంటూ  పుల్లారెడ్డి, మల్లారెడ్డిని హెచ్చరిస్తున్న మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

Latest Videos

undefined

పుల్లారెడ్డి పాత్రపై దర్యాప్తు జరపాలి : బిజెపి
మల్లా రెడ్డి హత్య కేసులో స్థానిక ఎమ్మెల్యే వియ్యంకుడు పుల్లారెడ్డి పాత్రపై విచారణ జరపాలని బిజెపి రాష్ట్ర కోశాధికారి వి. సత్యమూర్తి డిమాండ్ చేశారు. గురువారం జగ్గయ్యపేటలో ఆయన మాట్లాడుతూ.. పుల్లారెడ్డి ఆగడాలను ఎదిరిస్తున్నాడనే అక్కసుతో మల్లారెడ్డిని లారీతో ఢీ కొట్టి హతమార్చారు అన్నారు. స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశామని, దోషులకు శిక్ష పడేవరకు పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పారు.

కాగా, ఈ నెల 19న కృష్ణా జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య కలకలం రేపింది. జగ్గయ్యపేట నియోజనవర్గ పరిధిలోని చిట్యాలకు చెందిన మల్లారెడ్డి వల్సవాయి మండల కేంద్రంలో పని చూసుకుని రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా మాటు వేసిన గుర్తు తెలియని దుండగలు మల్లారెడ్డిని హతమార్చారు. ఘటన మీద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. మల్లారెడ్డి దుండగుల నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయగా.. వెంటబడి మరీ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు కారణాలమీద పోలీసులు ఆరా తీస్తున్నారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. 

click me!