బీజేపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి: తేల్చేసిన తోట త్రిమూర్తులు

By Nagaraju penumalaFirst Published Jul 1, 2019, 5:15 PM IST
Highlights

తాము తెలుగుదేశం పార్టీని వీడేందుకు ఈ సమావేశం నిర్వహించలేదని తోట త్రిమూర్తులు తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఓటమి, భవిష్యత్ కార్యచరణపై సమావేశంలో చర్చించినట్లు చెప్తున్నారు. అయితే మరికాసేపట్లో కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలవనున్నారు. 
 
అమరావతి: బీజేపీలో చేరాలంటూ తమకు ఆహ్వానాలు అందుతున్నాయని తేల్చి చెప్పారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు. తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచనపై తమ మధ్య ఎలాంటి చర్చ  జరగలేదన్నారు. 

సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా నివాసంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు సమావేశం అయ్యారు. సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో  కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు నేతృత్వంలో కాకినాడలో భేటీ అయ్యారు. 

గత ఎన్నికల్లో  కాపు సామాజిక వర్గం నేతలు పోటీ చేసిన స్థానంలో టీడీపీ సహాయనిరాకరణ చేసిందని, కాపు సామాజిక వర్గం నేతల భవిష్యత్ కార్యచరణపై చర్చించినట్లు నేతలు తెలిపారు. అయితే తాజాగా సోమవారం మరోసారి భేటీ అవ్వడం కలకలం రేపుతోంది. 

click me!