ఏపీలో కొత్త ప్రభుత్వం, బీజేపీదీ కీలకపాత్ర: రామ్ మాధవ్

By narsimha lodeFirst Published Oct 22, 2018, 12:33 PM IST
Highlights

త్వరలో జరిగే ఎన్నికల్లో ఏపీలో  టీడీపీ ప్రభుత్వం కుప్పకూలిపోతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ జోస్యం చెప్పారు

అమరావతి: త్వరలో జరిగే ఎన్నికల్లో ఏపీలో  టీడీపీ ప్రభుత్వం కుప్పకూలిపోతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ జోస్యం చెప్పారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో బీజేపీ ప్రముఖ పాత్ర పోషించనుందని ఆయన తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే  అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించనున్నట్టు  ఆయన హామీ ఇచ్చారు. చంద్రబాబునాయుడు హిట్లర్ తరహా పాలనను కొనసాగిస్తున్నారన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా సోమవారం నాడు అమరావతిలో బీజేపీ విజయవాడలో ధర్మపోరాట దీక్షను  ఆ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఈ దీక్షలను ప్రారంభించారు. ఐదు రోజుల పాటు రిలే దీక్షలు కొనసాగుతాయి. 

అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  రామ్ మాధవ్ ఆరోపించారు.   మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం  అవినీతికి దూరంగా ఉందని రామ్ మాధవ్ గుర్తు చేశారు. 

టీడీపీ అంటే తెలుగు దోపీడీ పార్టీగా మారిందన్నారు.  బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.  దేశంలో పేదల సంక్షేమం కోసం మోడీ  పనిచేస్తున్నాడని చెప్పారు. 

అగ్రిగోల్డ్ బాధితులకు  రూ. 6500 కోట్లు చెల్లించడం ఏపీ లాంటి పెద్ద ప్రభుత్వానికి కష్టం కాదన్నారు. ఏపీలో ప్రస్తుతం భూ కబ్జాదారులకు అండగా నిలిచే ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. భూ కబ్జాదారుల అండగా నిలిచేందుకు వీలుగా అగ్రి గోల్డ్ భూములపై కన్నేసి ఈ సమస్య పరిష్కారం కాకుండా టీడీపీ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు.

2014లో ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రాల్లో   టీడీపీ,  టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నారు. అయితే అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంటే, ఏపీ నాలుగో స్థానంలో ఉందని రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ఈ రెండు ప్రభుత్వాలు దుర్వినియోగం చేశాయని  ఆయన విమర్శించారు.

కేంద్రంపై తప్పుడు ప్రచారం  చేస్తూ  తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు  టీడీపీ ప్రయత్నించిందని రామ్ మాధవ్ విమర్శించారు.ఏపీకి  న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో  తాము ఆ మేరకు సహాయం చేశామని, ఇప్పుడు  కూడ అదే రకంగా సహాయం  చేస్తున్నామని  రామ్ మాధవ్ చెప్పారు.

ప్రత్యేకహోదా కంటే  ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చినా  రాష్ట్రం  సుముఖంగా లేదన్నారు.  గోబెల్స్ బాస్ చంద్రబాబునాయుడు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే రాష్ట్ర ద్రోహులుగా టీడీపీ నేతలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నేతలు వాడుతున్న భాష పట్ల రామ్ మాధవ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 


 

click me!