చింతమనేనిని అరెస్టు చేయాలని డిమాండ్

Published : Oct 22, 2018, 11:58 AM IST
చింతమనేనిని అరెస్టు చేయాలని డిమాండ్

సారాంశం

హమాలీ కార్మికుడు రాచీటి జాన్‌పై దాడిచేసి కులం పేరుతో దూషించిన కేసులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం పట్ల అఖిలపక్షం నిరసన వ్యక్తం చేసింది. 

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని అరెస్టు చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హమాలీ కార్మికుడు రాచీటి జాన్‌పై దాడిచేసి కులం పేరుతో దూషించిన కేసులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం పట్ల అఖిలపక్షం నిరసన వ్యక్తం చేసింది. ఆదివారం ఇఫ్టూ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అధ్యక్షత వహించిన కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు మాట్లాడుతూ చింతమనేని అరెస్టు కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
 
సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసి జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు, సీపీఎం నగర కార్యదర్శి పి.కిషోర్‌, సీపీఐ నగర కార్యదర్శి పి.కన్నబాబు, అమానుద్దీన్‌, ఎంసీపీయూ జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజు, ఏఐటీఆర్‌ఎఫ్‌ నాయకులు ఆర్‌.మణిసింగ్‌, బేతాళ సుదర్శన్‌, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి కెవి రత్నం, బాధితుడు రాచీటి జాన్‌, ఇఫ్టూ నగర కార్యదర్శి బద్దా వెంకటేశ్వరరావులు సమావేశంలో ప్రసంగించారు. అట్రాసిటీ కేసు నమోదైనా ఇంతవరకు చింతమనేనిని అరెస్టు చేయకుండా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ నెల 23వ తేదీన చింతమనేనిని అరెస్టు చేయాలంటూ నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.

PREV
click me!

Recommended Stories

వేలఎ కరాలు ఎందుకు? Jagan Sensational Comments on Amaravati | Jaganmohan Reddy | Asianet News Telugu
CM Nara Chandrababu Naidu Speech: మెప్మా, డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు గుడ్ న్యూస్ | Asianet Telugu