రాష్ట్రంలో పార్టీ నాయకత్వాన్ని మార్చాలని ఏపీ ఇంచార్జీ మురళీధర్ ను కోరినట్టుగా అసంతృప్త నేతలు చెప్పారు.
న్యూఢిల్లీ: రాష్ట్రంలో పార్టీ నాయకత్వాన్ని మార్చాలని పార్టీ ఇంచార్జీ మురళీధరన్ ను కోరినట్టుగా అసంతృప్త నేతలు చెప్పారు.గురువారం నాడు ఏపీ రాష్ట్రానికి చెందిన 13 జిల్లాల నేతలు పార్టీ ఇంచార్జీ మురళీధరన్ తో న్యూఢీల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను మురళీధరన్ కు వివరించినట్టుగా చెప్పారు. ఇదే పరిస్థితులు కొనసాగితే పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్తితులు తప్పవని అసంతృప్త నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కూడా మురళీధరన్ దృష్టికి తీసుకువచ్చినట్టుగా ఆయన చెప్పారు.
ఇక నుండి నెలలో 15 రోజులకు ఒకసారి రాష్ట్రంలో పర్యటించనున్నట్టుగా మురళీధరన్ చెప్పారు. ఇక నుండి రాష్ట్రంలో పర్యటించిన సమయంలో మీ సమస్యలను తనకు చెప్పాలని మురళీధరన్ చెప్పారని బీజేపీ నేతలు తెలిపారు. జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు విషయంలో కూడా సీనియర్ల అభిప్రాయాలను కూడ పక్కన పెట్టారని ఆయన విమర్శించారు. నిర్ణయాల విషయాల్లో కూడా సీనియర్లను సంప్రదించని విషయాన్ని కూడా తాము మురళీధరన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. పార్టీ నాయకత్వాన్ని మార్పు లేకున్నా కూడా కనీసం వారి పద్దతులను మార్చుకోవాలని అసంతృప్త నేతలు కోరుతున్నారు
undefined
also read:ఢిల్లీకి ఏపీ బీజేపీ పంచాయితీ.. నేడు మురళీధరన్‌తో అసంతృప్త నేతల భేటీ.. టార్గెట్ సోము వీర్రాజు?
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ను లక్ష్యంగా చేసుకొని అసంతృప్త నేతలు ఇవాళ మురళీధరన్ కు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. సోము వీర్రాజు తీరుతోనే తాను పార్టీని వీడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. గతంలో కొంతకాలంగా సోము వీర్రాజు తీరుపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడారు. ఇవాళ టీడీపీలో చేరారు.