కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. గురువారం నాడు ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు.
అమరావతి: కొత్త Districts ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందని బీజేపీ నేత Somu Veerraju ప్రశ్నించారు. గురువారం నాడు ఆయన విశాఖపట్డుటణంలో మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రెండున్నర ఏళ్లు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రతి జిల్లాకు ఒక కమిటీ ఏర్పాటు చేసి అభిప్రాయాన్ని సేకరించాలని ఆయన కోరారు.చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలే తమ పార్టీ విధానమని సోము వీర్రాజు చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గం వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని తాము గతంలోనే చెప్పామన్నారు.
జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే జిన్నా టవర్ ను అబ్దుల్ కలాం టవర్ గా పేరు మార్చాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో Temple విధ్వంసకారులపై చర్యలేవని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అల్లకల్లోలం సృష్టిస్తోందని వైసీపీ చేస్తున్న విమర్శలు అర్ధరహితమన్నారు. Ycp క్యాసినో పార్టీ అంటూ ఆయన మండిపడ్డారు. గుడివాడకు వెళ్తే మీకు భయమెందుకని ఆయన వూసీపీ నేతలను ప్రశ్నించారు.
రాష్ట్రంలో రోడ్లపై తిరిగే పరిస్థితి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ను మోడీ ప్రభుత్వమే అభివృద్ది చేస్తోందన్నారు. Employees డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి మండలి మంగళవారం నాడు ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం Notification విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ పై ప్రజలు తమ సూచనలు,సలహాలతో పాటు అభిప్రాయాలను తెలపాలని ప్రభుత్వం కోరింది. వచ్చే నెల 26వ తేదీ వరకు ప్రజలకు గడువును ఇచ్చింది. ఉగాది నుండి కొత్త జిల్లాల నుండి పాలన సాగించాలని జగన్ సర్కార్ తలపెట్టింది. ఇదే విషయాన్ని ఇవాళ రిపబ్లిక్ డే ఉత్సవాల్లో కూడా గవర్నర్ ప్రస్తావించారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు YS Jagan హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. అయితే రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.. అరకు ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించారు. అరకు పార్లమెంట్ స్థానం నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. దీంతో ఈ ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గతంలోనే జీవోను జారీ చేసింది.
కొత్త జిల్లాల ఏర్పాటుపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Nilam Sawhney నేతృత్వంలో 2020 ఆగష్టు 9వ తేదీన అధ్యయన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. New జిల్లాల ఏర్పాటు విషయంలో సరిహద్దులు, సాంకేతిక అంశాలను కూడ ఈ కమిటి అధ్యయనం చేసింది.2021 మార్చి 31వ తేదీ నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.అయితే అనేక కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.
కొత్త జిల్లాల ప్రక్రియను వేగవంతం చేయడానికి మంగళవారం నాడు ఆన్ లైన్ మంత్రిమండలి సమావేశంలో కొత్త జిల్లాలకు జగన్ సర్కార్ పచ్చ జెడా ఊపింది. మరునాడే నోటిఫికేషన్ ను కూడా జారీ చేిసింది. కొత్త జిల్లాలపై ప్రజల నుండి వచ్చే సూచనలు, సలహాలు, ఫిర్యాదులపై నెల రోజుల తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే కొన్ని జిల్లాల ఏర్పాటు విషయమై ప్రజలు ఆందోళన బాట పట్టారు.