జగన్ ప్రభుత్వ ప్రతీకార చర్య: రఘురామ అరెస్టుపై సోము వీర్రాజు

Published : May 15, 2021, 09:54 PM IST
జగన్ ప్రభుత్వ ప్రతీకార చర్య: రఘురామ అరెస్టుపై సోము వీర్రాజు

సారాంశం

వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు అరెస్టుపై, ఆయన కాలికి గాయమైన సంఘటనపై బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. జగన్ ప్రభుత్వం ప్రతీకార చర్యను మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అమరావతి: రాష్ట్ర పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడిన పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు చిత్రాలు కలతపెట్టేవి, ఖండించదగినవని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని ఆయన అభిప్రాయపడ్డారు. 

పార్లమెంటు సభ్యుడిని ఈ విధంగా రాష్ట్ర పోలీసులు వేధించగలిగితే, రాష్ట్రంలోని సాధారణ ప్రజల స్థితి ఏమిటని ఆయన అడిగారు. ఈ దారుణానికి కారణమైన పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read: మే 28 వరకు రఘురామకు రిమాండ్.. ఆరోగ్యం కుదటపడ్డాక జైలుకి : సీఐడీ కోర్ట్ ఆదేశాలు

రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, రాజకీయ ఎజెండాను నెరవేర్చడానికి రాజకీయ క్రూరత్వాన్ని చూపించడం అప్రజాస్వామిక చర్య అని ఆమోదయోగ్యం కాదని ఆయన మరోసారి అన్నిారు.

వైసీపీ ప్రభుత్వం తన ప్రతీకార చర్యలను ఆపి, ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాజకీయంగా ప్రేరేపించిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏది ఏమైనా, న్యాయస్థానాల ద్వారా త్వరలో న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు..

Also Read: కాళ్ల నిండా గాయాలు.. పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి రఘురామరాజు ఫిర్యాదు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!