ఇలానే వ్యవహరిస్తే చెడుగుడే: జగన్‌ సర్కార్‌కి సోము వీర్రాజు వార్నింగ్

Published : Jan 11, 2022, 11:54 AM ISTUpdated : Jan 11, 2022, 12:01 PM IST
ఇలానే వ్యవహరిస్తే చెడుగుడే: జగన్‌ సర్కార్‌కి సోము వీర్రాజు వార్నింగ్

సారాంశం

తాము అధికారంలోకి వస్తే  ఇసుకను ఉచితంగా ఇస్తామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. మంగళవారం నాడు వీర్రాజు మీడియాతో మాట్లాడారు. 

అమరావతి:  తాము అధికారంలోకి వస్తే ఇసుకను ఉచితంగా ఇస్తామని ఏపీ Bjp రాష్ట్ర అధ్యక్షుడు Somu Veerraju చెప్పారు. మరో వైపు ఒక్క బస్తా cement  ను రూ.220లకి అందిస్తామన్నారు. 

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు.తమ పార్టీకి చెందిన Kurnool  జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిని హత్య చేస్తామని బెదిరింపు ఫోన్లు వచ్చాయని సోము వీర్రాజు చెప్పారు.  తమ పార్టీ జిల్లా అధ్యక్షుడిపై హత్యాయత్నం చేసే పరిస్థితిని కూడా తీసుకొచ్చారన్నారు.Srikanth Reddy పై 307 సెక్షన్ కింద కేసు ఎలా పెడతారని సోము వీర్రాజు ప్రశ్నించారు.  పోలీసులకు, ప్రభుత్వానికి ఏమైనా కళ్లు పోయాయా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రశ్నించారు.

Atmakurలో 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో కూడా అధికార పార్టీకి చెందిన నేతలు ఎలా పర్యటించారని బీజేపీ అధ్యక్షుడు ప్రశ్నించారు. ఆత్మకూర్ ఘటనపై police  కూడా అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తాము కూడా ఆత్మకూరు వెళ్తామని సోము వీర్రాజు చెప్పారు. ఆత్మకూరు ఘటనలో ప్రధాన ముద్దాయి స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డేనని సోము వీర్రాజు ఆరోపించారు. ఓ వర్గం వారిని సంతృప్తి పర్చేందుకే అధికార పార్టీ ఈ రకంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.  ఓ వర్గం ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతంలో మరో వర్గానికి చెందిన ప్రార్ధనా మందిరాన్ని ఎమ్మెల్యే ఎలా కట్టించారో చెప్పాలని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని వీర్రాజు ప్రశ్నించారు.  ఈ విషయమై ప్రశ్నించేందుకు వెళ్లిన తమ పార్టీ నేతలపై దాడి చేశారన్నారు.

ఇదే రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తే రాష్ట్ర ప్రభుత్వంతో తాము చెడుగుడు ఆడుతామని సోము వీర్రాజు హెచ్చరించారు.Cinema  టికెట్ల ధరల తగ్గింపుపై  ఏపీ ప్రభుత్వం తీరును వీర్రాజు తప్పుబట్టారు. ఇసుక ధరలను తగ్గించవచ్చుగా అని ఆయన ప్రభుత్వానికి సూచించారు. సినిమా టికెట్ల ధరలను ఎందుకు తగ్గించారని ఆయన ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి పాల్పడుతున్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడాలన్నారు.వరి ధాన్యాన్ని క్వింటాల్ కు రూ. 1400 చెల్లించాలని  సీఎం జగన్ ను కోరారు. మరో వైపు తాము అధికారంలోకి వస్తే బియ్యాన్ని రూ. 40 లకే అందిస్తామన్నారు. 

గత వారంలో ఆత్మకూరులో ఓ ప్రార్ధనా మందిరం విషయంలో వివాదం చెలరేగింది.ప్రార్ధనా మందిర నిర్మాణాన్ని బీజేపీ  అడ్డు చెప్పింది.ప్రార్ధన మందిరం నిర్మాణ ప్రాంతం నుండి తిరిగి వెళ్లే సమయంలో బీజేపీ నేత వాహనాన్ని మరో వర్గం వారు అడ్డుకొన్నారు. వారి నుండి తప్పించుకొనే క్రమంలో వాహనాన్ని వేగంగా నడపడంతో మరో వర్గానికి చెందిన వారికి గాయాలయ్యాయి. దీంతో బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పోలీస్ స్టేషన్ పైకి కూడా గాయపడిన వర్గానికి చెందిన వాళ్లు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈత్మకూరు ఘటనను ఆసరాగా తీసుకొని మత విద్వేషాలు రెచ్చగొడితే సహించబోమని డీజేపీ హెచ్చరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Fog Alert : అధికపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఫాగ్ సైక్లోన్ కొనసాగుతోందా..? ఈ 12 జిల్లాలకు హైఅలర్ట్
IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu