ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఇవాళ సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేసే విషయమై చర్చించారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారంనాడు హైద్రాబాద్ లో భేటీ అయ్యారు.ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు.ఆ తర్వాత వారం రోజులకు విజయవాడకు వెళ్లారు కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీకి చెందిన ఏపీ నేతలను కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు.
ఇవాళ హైద్రాబాద్ లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో బీజేపీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం చేసే విషయమై నేతలు చర్చించారు. మర్యాద పూర్వకంగానే కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమైనట్టుగా సోము వీర్రాజు చెప్పారు. పార్టీ బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కిరణ్ కుమార్ రెడ్డి నుండి సలహలు, సూచనలు తీసుకున్నట్టుగా సోము వీర్రాజు చెప్పారు.
undefined
పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఏ రకమైన వ్యూహంతో వెళ్లాలనే విషయమై కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని సూచనలు చేశారని సోము వీర్రాజు చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి సూచనలను పాటిస్తూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయనున్నట్టుగా సోము వీర్రాజు చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఎలా ఉంది,. మనం ఏం చేయాలనే దానిపై చర్చించినట్టుగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీ బలోపేతం చేసేందుకుగాను తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. పార్టీ ఎక్కడ పనిచేయాలని కోరితే అక్కడ పనిచేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.