తిరుపతి జిల్లాలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..

Published : May 31, 2023, 04:41 PM ISTUpdated : May 31, 2023, 05:28 PM IST
 తిరుపతి జిల్లాలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..

సారాంశం

తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.టపాసుల గోదాంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ముగ్గురు మృతిచెందారు.

తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వరదయ్యపాళెం మండలంలోని యల్లకట్టనలో ఉన్న టపాసుల గోదాం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ముగ్గురు మృతిచెందారు. ఘటన స్థలంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో అక్కడివారు భయాందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

అయితే పేలుడు చోటుచేసుకున్న గోదాంలో మరికొంత మంది ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే.. ప్రమాదం చోటుచేసుకనున్న టపాసుల గోదాంకు సమీపంలోనే మరో టపాసుల గోదాం ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?