గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఏపీ, తెలంగాణలో అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

By narsimha lode  |  First Published Feb 14, 2023, 12:24 PM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో  టీచర్స్,  గ్రాడ్యుయేట్స్  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను  బీజేపీ ప్రకటించింది.


హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఎమ్మెల్సీ ఎన్నికలకు  అభ్యర్ధులను ప్రకటించింది. బీజేపీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో  స్థానిక సంస్థల, పట్టభద్రుల,  టీచర్స్  ఎమ్మెల్సీ స్థానాలకు   వచ్చే నెలలో  ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఎన్నికల షెడ్యూల్ ను  కేంద్ర ఎన్నికల సంఘం  ఇటీవలనే విడుదల చేసింది.   

తెలంగాణ రాష్ట్రంలోని  మహబూబ్ నగర్ -రంగారెడ్డి- హైద్రాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి   బీజేపీ అభ్యర్ధిగా వెంకట్ నారాయణ రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  ఉత్తరాంధ్ర  గ్రాడ్యుయేట్స్  స్థానానికి బీజేపీ అభ్యర్ధిగా  
 మాధవ్ , కడప గ్రాడ్యుయేట్స్  ఎమ్మెల్సీ  అభ్యర్ధిగా రాఘవేంద్ర, ప్రకాశం  గ్రాడ్యుయేట్స్  అభ్యర్ధిగా దయాకర్ రెడ్డిని బీజేపీ  బరిలోకి దింపనుంది.

Latest Videos

రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 ఎమ్మెల్సీ స్థానాలకు  ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది మార్చి 13న పోలింగ్  జరగనుంది.   ఈ ఎమ్మెల్సీ స్థానాలకు  ఈ నెల  16న నోటిఫికేషన్ విడుదల కానుంది.

also read:ఏపీ, తెలంగాణలో 15 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదల: మార్చి 13న పోలింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు,.కడప-అనంతపురం-కర్నూల్ శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్టణం  గ్రాడ్యుయేట్స్ స్తానాలకు  ఎన్నికలు జరగనున్నాయి.  ఏపీ రాష్ట్రంలోని ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు,కడప-అనంతపురం-కర్నూల్  కు చెందిన టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.  ఇక  అనంతపురం,కడప ,నెల్లూరు,పశ్చిమగోదావరి,తూర్పు గోదావరి,శ్రీకాకుళం,చిత్తూరు,కర్నూల్ స్థానిక  సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు  ఎన్నికలు జరుగుతాయి.  ఇక తెలంగాణ రాష్ట్రంలోని    మహబూబ్ నగర్- రంగారెడ్డి -హైద్రాబాద్  టీచర్స్  ఎమ్మెల్సీ స్థానానికి ,హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి  ఎన్నికలు జరుగుతాయి.

click me!