దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని జగన్ పై బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను జగన్ సర్కార్ విస్మరించిందన్నారు.
కడప: దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ పై బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శలు చేశారు.బుధవారం నాడు కడపలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. దోచుకున్న సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వైసీపీ పై విమర్శలు చేశారు. దోచుకునే వారినే ప్రజలు ఎన్నుకున్నారని ఆయన పరోక్షంగా జగన్ పై ఆరోపణలు చేశారు. ప్రభుత్వ లిక్కర్ షాపులో జగన్ కు పేటీఎం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం 8లక్షల 60 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ది కి రూ. 3 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని సోము వీర్రాజు చెప్పారు. ప్రజలకు అబద్దాలు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను జగన్ సర్కార్ విస్మరించిందని ఆయన విమర్శించారు. కంప్యూటర్ లో బటన్ లు నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. బస్టాండ్ కూడ నిర్మించలేని స్థితిలో జగన్ సర్కార్ ఉందని ఆయన విమర్శించారు.
రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యతను తమ పార్టీ తీసకుంటుందన్నారు.
undefined
వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి జనసేన పోటీ చేసింది. ఎన్నికల తర్వాత బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ప్రయత్నిస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవల పదే పదే ప్రకటిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ పార్టీల పొత్తులపై ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీతో పొత్తు ఉండబోదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఎన్నికల నాటికి పొత్తుల విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.